ప్రేమించి పెళ్లి చేసుకోవట్లేదని యువతిపై దాడి..ఆత్మహత్యయత్నం

నల్గొండ జిల్లా: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు ఆమె దాడి చేసిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. ఆ తర్వాత యువకుడు కూడా ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రస్తుతం హాస్పిటల్ లో కొట్టుమిట్టాడుతున్నాడు. చింతపల్లి మండలం, కిష్టరాయునిపల్లికి చెందిన శివ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. ఇద్దరినీ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే.. తీరా పెళ్లి చేసుకుందామనే సరికి పెద్దల భయంతో యువతి పెళ్లికి ఒప్పకోలేదని.. కోపంతో శివ ఆమెపై పక్కనే ఉన్న బీర్ బాటిల్ తో దాడి చేశాడు.  యువతి తలపై బీర్ బాటిల్ తో గట్టిగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది.

దీంతో ప్రియురాలు చనిపోయిందనే భయంతో..మనస్తపానికి గురైన శివ కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. యువతిని కొట్టడంతో స్థానికులు శివపై సీరియస్ కావడంతో .. వెంటనే గ్రామంలోని మంచి నీటి ట్యాంక్ పై నుంచి దూకాడు. పరిస్ధితి విషమించడంతో శివను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు కుటుంబ సభ్యులు. యువతి కూడా స్థానిక హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపారు ఆమె కుటుంబ సభ్యలు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates