హ‌న్మ‌కొండ‌లో వ్యభిచార గృహంపై దాడి.. ఇద్దరు విటులు అరెస్ట్‌

వరంగల్: సీక్రెట్ గా వ్య‌భిచారం చేస్తున్న వారిని ప‌ట్టుకున్నారు పోలీసులు. ఈ సంఘ‌ట‌న ఆదివారం వ‌రంగల్ జిల్లాలో జ‌రిగింది. కొన్ని రోజులుగా వ్యభాచారం సాగిస్తున్న ఇంటిపై పోలీసులు దాడి చేసి, ఇద్దరు విటులను, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హన్మకొండ పరిధిలో యూనివర్సిటీ I- గేట్ సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచార సాగిస్తున్నారని కాలనీ వాసులు హన్మకొండ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మూకుమ్మడిగా అ ఇంటిపై దాడి చేసి ఐదుగురు యువతులతో పాటు ఇద్దరు విటులను పట్టుకున్నారు. విటుల్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని పోలీసులు చెప్పారు. విటులతో పాటు వారి కారును స్వాధీన పరచుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.

Latest Updates