బర్కత్ పురలో ప్రేమోన్మాది దాడి

Madhulika-Bharath 01బర్కత్ పురలో నడి రోడ్డుపై ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు ప్రేమోన్మాది. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో యువకుడు వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ కాలేజీకి వెళుతున్న సమయంలో.. బర్కత్ పుర ప్రాంతంలో కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. గాయపడిన విద్యార్థినిని చికిత్స కోసం మలక్ పేట్ యశోద ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు.

ఏడాది నుండి భరత్ తన సోదరిని వేధిస్తున్నాడని మధులిక అక్క తెలిపింది. ఇదే విషయం పై గత నెల 7న భరోసా కేంద్రంలో ఫిర్యాదు చేశామని, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారన్నది. ఈరోజు ఉదయం కాలేజ్ కు బయలుదేరిన మధులిక ను ఇంటి సమీపంలో భరత్ కత్తితో దాడి చేశాడని తెలిపింది.

Latest Updates