టికెట్​ ఇప్పించలేదని పెట్రోల్​ పోసిండు

కారేపల్లి, వెలుగు: కోఆపరేటివ్​​ సొసైటీ ఎన్నికల్లో టీఆర్ఎస్​ టికెట్​ఇప్పించలేదని జడ్పీటీసీపై ఓ కార్యకర్త పెట్రోల్​పోశాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ ​తండాకు చెందిన గుగులోత్ ​అతిరామ్ ​టీఆర్​ఎస్ ​కార్యకర్త. సొసైటీ ఎన్నికల్లో 2వ వార్డు నుంచి పోటీ చేయాలని అనుకున్నాడు. జడ్పీటీసీ జగన్ ​తన గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో టికెట్​ఇప్పించమని పలుసార్లు కోరాడు. దీనికి జగన్​ఒప్పుకోలేదు. నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు పార్టీ టికెట్​ ఇప్పించడం కుదరదని తేల్చి చెప్పాడు.

మనస్తాపానికి గురైన అతిరామ్​ శుక్రవారం  ఓ పెండ్లికి హాజరైన జడ్పీటీసీపై క్యాన్​లో తీసుకువెళ్లిన పెట్రోల్ పోశాడు. గమనించిన మిగతా నాయకులు అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. జడ్పీటీసీ ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకన్న కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates