ఫ్లెక్సీల విషయంలో రెండు TRS వర్గాల దాడులు

వరంగల్ జిల్లాలోని రెండు TRS వర్గాలు దాడులు చేసుకున్నాయి. ఫ్లెక్సీల విషయంలో ఘర్షణ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ లోని 20డివిజన్ లో TRS కార్యకర్తకు చెందిన స్వచ్ఛంద సంస్ధను లాంచ్ చేయడానికి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ ని రావుని ఆహ్వానించారు. ఆయన పేరుతో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే… ఎమ్మెల్యే నరేందర్ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయాలని ఆయన అనుచరులు కోరారు. అందుకు ఒప్పుకోకపోవడంతో TRSలో రెండు వర్గాల నేతల మధ్య మాట మాట పెరిగి ఘర్షణ జరిగింది.  ఈ గొడవలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో MGM హస్పిటల్ కి తరలించారు. కార్యకర్తలు దాడి చేసుకున్న వీడియోలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Latest Updates