అరవింద్ కేజ్రీవాల్ కారుపై దాడి

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కారుపై దాడి జరిగింది. సీఎం కాన్వాయ్‌ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొందరు ఆందోళనకారులు కేజ్రీవాల్‌ కారుపై కర్రలతో దాడి చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.

అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు కేజ్రీవాల్‌ శుక్రవారం సాయంత్రం నరేలా ప్రాంతానికి బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో 100 మంది ఆందోళనకారులు సీఎం కాన్వాయ్‌ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.కర్రలతో కారుపై దాడి చేసినట్లు సీఎంవో కార్యాలయం అధికారులు తెలిపారు.

BJP కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్లు ఆప్‌ వర్గాలు ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలను భారతీయ జనతాపార్టీ కొట్టిపారేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Latest Updates