హైదరాబాద్‎లో మరో చిన్నారిపై అత్యాచారయత్నం

హైదరాబాద్‎లో మరో చిన్నారిపై అత్యాచారయత్నం

హైదరాబాద్: సింగరేణి కాలనీ హత్యాచార ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం జరిగింది. మంగళ్‎హట్ పీఎస్ పరిధిలోని హబీబ్ నగర్‎.. మాంగారు బస్తీలో తొమ్మిదేళ్ల చిన్నారిపై సుమిత్ అనే యువకుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఖాళీగా ఉన్న దుకాణం షేటర్‎లోకి చిన్నారిని లాక్కెళ్లి అత్యాచారం చేయబోయాడు. చిన్నారి కేకలు వేయడంతో.. స్థానికులు రావడంతో.. సుమిత్ అక్కడినుంచి పరారయ్యాడు. స్థానికుల అలర్ట్‎తో చిన్నారి సేఫ్‎గా బయటపడింది. తప్పించుకున్న నిందితుడిని అత్తాపూర్‎లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.