ఇనుప రాడ్డుతో ఏటీఎం లో చోరీకి విఫలయత్నం

 

 

విజయవాడ: విజయవాడ పోరంకి సెంటర్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్  ఏటిఎమ్ సెంటర్లో చోరికి విఫల యత్నం జరిగింది. దుండగుడు ఇనపరాడ్డు తో ఏటిమ్ మిషన్ తెరిచేందుకు ప్రయత్నం చేశాడు. పలుమార్లు రాడ్డుతో బాదాడు. ఎంత చేసినా ఏటీఎం తెరతెరుచుకోక పోవటంతో అగంతకుడు ఉడాయించాడు. గత రెండు మూడు రోజులుగా అగంతకుడు ఈ ఏటీఎంలో చోరీ కోసం రెక్కీ నిర్వహించినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. దగ్గర్లోనే మరికొన్నిఏటీఎం సెంటర్లు ఉన్నా.. దీన్ని సురక్షితమైనదిగా భావించి చోరీకి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు ఇటు వైపు జన సంచారం ఉండడం లేదని.. గస్తీ పోలీసులు కూడా ఇటు వైపు తనిఖీలకు రావడం లేదని గుర్తించి చోరీకి ప్లాన్ చేసిట్లు అనుమానాలు కలుగుతున్నాయి. సిసి పుటేజ్ పరిశీలిస్తున్న పెనమలూరు పోలీసులు దుండగుడి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Latest Updates