దేశం బాగుపడాలంటే మోడీ మళ్లీ రావాలి : నిర్మల సీతారామన్

హైదరాబాద్ : దేశం బాగుపడాలంటే మోడీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండాలన్నారు.. రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మోడీ నిస్వార్ధపరుడైన వ్యక్తి ప్రధానిగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ సైనిక్ పురి కమ్యూనిటీ హాల్ లో మాజీ సైనికులు, మేధావులతో ఏర్పాటు చేసిన సమావేశానికి నిర్మల సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నరేంద్ర మోడీ మరోసారి అధికారంలోకి రావాలంటే.. అది మీ చేతుల్లోనే ఉందన్నారు నిర్మల. ఇక టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే.. కేసీఆర్ కుటుంబానికే సేవచేస్తారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తే ప్రజలకు సేవ చేస్తారని చెప్పారు.

Latest Updates