కొత్తగా 50 దేశాల్లోకి విశాక ఆటమ్‌‌

  • యూఎల్‌‌ నుంచి ఐఈసీ సర్టిఫికేషన్‌‌
  • ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌‌ రూఫ్‌ గా గుర్తింపు

హైదరాబాద్‌‌, వెలుగువిశాక ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌‌  కొత్తగా 50 దేశాల మార్కెట్లలోకి దూసుకుపోనుంది. ఇటీవల విశాక ఇండస్ట్రీస్‌‌ ఆటమ్ సోలార్ రూఫ్ పానల్స్‌‌కు గ్లోబల్ సేఫ్టీ సైన్స్ కంపెనీ యూఎల్ నుంచి ఐఈసీ సర్టిఫికేషన్‌‌ రావడంతో, కంపెనీకి ఇది సాధ్యమవుతోంది. ఈ సర్టిఫికేషన్‌‌తో యూరప్, లాటిన్ అమెరికా సహా 50 దేశాలలోకి అడుగుపెట్టేందుకు సాయపడుతుందని విశాక ఇండస్ట్రీస్ తెలిపింది. సోలార్‌‌ ఫోటోవోల్టాయిక్‌‌ (పీవీ) మాడ్యూల్‌‌ టెస్టుల తర్వాత ఈ సర్టిఫికేషన్ లభించింది. విశాక ఇండస్ట్రీస్‌‌  ప్రొడక్ట్‌‌ ఆటమ్‌‌ ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇంటిగ్రేటెడ్‌‌ సోలార్‌‌ రూఫ్‌‌గా గుర్తింపు తెచ్చుకుంది.2016 లో సవరించిన ఐఈసీ ప్రమాణాలకు అనుగుణంగా ఆటమ్‌‌ ఉందని ఈ సర్టిఫికేషన్‌‌ గుర్తిస్తోంది. సోలార్‌‌ ఇండస్ట్రీ అవసరాలు మారుతున్న నేపథ్యంలో ఐఈసీ స్టాండర్డ్స్‌‌ను 2016 లో మార్చారు. క్రిస్టలిన్ సిలికాన్, ఇతర థిన్‌‌ ఫిల్మ్‌‌ టెక్నాలజీలతో తయారు చేసి సోలార్ మాడ్యూల్స్  భద్రత, సామర్థ్యాన్ని అంచనావేయడానికి వీటికి ఇతర పరీక్షల విధానాలు, సీక్వెన్స్, కాలపరిమితి వంటి ప్రమాణాలను మార్చారు.

కొత్త ప్రమాణాల ప్రకారం మాడ్యూల్స్ సైకిల్ టైమ్ 15 రోజుల నుంచి 120 రోజులకు పెంచాలి. పర్యావరణంలో యూవీ రేడియేషన్‌‌ను కంట్రోల్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఐఈసీ స్టాండర్డ్స్ ప్రకారం.. వీటికి కొత్త పరీక్ష పద్ధతులు, అర్హతలు, కండీషన్లు, మినిమం డిజైన్లు అవసరం. ఎక్కువ వోల్టేజీతోనూ పనిచేయడానికే ఈ కొత్త స్టాండర్డ్స్‌‌ను అమలు చేస్తున్నారు. రూఫ్, సోలార్ ప్యానెళ్లతో తయారైన ఆటమ్‌‌ను స్మార్ట్‌‌ఫోన్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ రూఫ్ దాదాపు 30 ఏళ్ల పాటు కరెంటును ఉత్పత్తి చేస్తుంది. పాలీ క్రిస్టలిన్ పీవీ సేల్స్, సిమెంట్ ఫైబర్‌‌‌‌ బోర్డుతో దీనిని తయారు చేయడం వల్ల చాలా మన్నికగా ఉంటుంది. పైకప్పుగానూ ఉపయోగించగలిగే ప్రపంచంలోని తొలి సోలార్ ప్యానెల్ ఇదే. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా, అగ్నిప్రమాదం వచ్చినా ఇది తట్టుకుంటుంది.

Latest Updates