కోర్టుల్లో పంద్రాగస్టు వేడుకలు 20 నిమిషాలే

అన్నికోర్టుల్లోఅమలుకు హైకోర్టు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని కోర్టుల్లో పంద్రాగస్టు వేడుకలను ఆంక్షలతో నిర్వహించాలని హైకోర్టు నిర్ణ‌యించింది. వేడుకలకు 50 మందికి మించకూడదని, 20 నిమిషాల్లో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అన్ని కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మాదిరిగా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించరాదని చెప్పింది. శానిటైజర్లు, మాస్క్‌‌లు ఉపయోగించే వారినే అనుమతించాలని, వాటిని ఆయా కోర్టులు అందుబాటులో ఉంచాలని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌‌ ఆర్‌ఎస్ చౌహాన్ ‌నేతృత్వంలోని జడ్జిలు నిర్ణ‌యించారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌ జనరల్ ‌‌వెంకటేశ్వర్ ‌రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Latest Updates