వీడియో: సంక్రాంతి అల్లుడికి 125 వంటకాలు చేసి పెట్టిన అత్త

ఆంధ్రప్రదేశ్‏లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగకు కూతురితో పాటు కొత్త అల్లుడు ఇంటికి రావడం.. అతనికి అత్తింటి వారు మర్యాదలు చేయడం సహజం. అయితే ఈ మధ్యే పెళ్లై పండగకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తింటి వారు చేసిన మర్యాదలు మాములుగా లేవు. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడుకి అత్తింటి వారు ఏకంగా 125 రకాల వంటలు వడ్డించారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో జరిగింది. అయితే ఆ 125 రకాల వంటకాల్లో అన్ని రుచులు ఉండేలా చూసుకున్నారు అత్తింటివారు. స్వీట్స్, హాట్, పండ్లు, బర్గర్లు, కూరగాయల వంటలు, రకారకాల రైస్‌‏లతో.. మొత్తం డైనింగ్ టేబుల్ నింపేశారు. ఆ టేబుల్ ముందు.. అల్లుడు, కూతురు కూర్చుని వంటకాలు రుచి చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

For More News..

కాళేశ్వరం చేరుకున్న కేసీఆర్.. ఆలయంలో పూజలు

వీడియో: విజయ్ దేవరకొండకు ’బీరాభిషేకం‘ చేసిన ఫ్యాన్స్

పెళ్లైన మూడు నెలలకే సూసైడ్ చేసుకున్న ఎస్సై

Latest Updates