ఇండోనేషియన్లు బస చేసిన ఊరి చుట్టు బారికేడ్స్

కరీంనగర్ లో పరిస్థితిపై అధికారులతో ఫోన్లో మాట్లాడారు సీఎం కేసీఆర్. అవసరమైతే  మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కరోనా కేసులు వేగంగా పెరుగుతుండడంతో కరీంనగర్ లో ఆంక్షలను మరింత కఠినం చేశారు అధికారులు. ముకరంపుర, కాశ్మీర్ గడ్డ, కలెక్టరేట్ లను రెడ్ జోన్లుగా ప్రకటించారు

కరీంనగర్ లో పోలీసులు భారీగా మోహరించారు. జిల్లాల సరిహద్దులు మూసేశారు. కరీంనగర్ కు వచ్చే దారుల్లో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రోడ్లపైకి వస్తే వెహికిల్స్ సీజ్ చేస్తున్నారు. కూరగాయల మార్కెట్ లో కూడా ఆంక్షలు విధిస్తున్నారు. కరోనా సంబంధ సమస్యలు, ఫిర్యాదులు ఉంటే హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.

ఇండోనేషియన్లు బస చేసిన ముకరంపురను బారికేడ్స్ తో దిగ్బంధం చేశారు. ముకరంపుర వాసులకు కావాల్సిన నిత్యావసర వస్తువులు అందించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఇండోనేషియా వాసులు సంచరించిన ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి టెస్టులు చేస్తున్నారు. ఇవాళ ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ లోని రెడ్ జోన్లలో లిక్విడ్ బ్లీచింగ్ స్ప్రే తో పరిసరాలను శుభ్రం చేస్తున్నారు.

కరీంనగర్ లో క్లీనింగ్ చర్యలు కొనసాగుతున్నాయి.  ఇండోనేషియా టీమ్ పర్యటించిన ముకరంపుర ప్రాంతాన్ని ఇప్పటికే ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. ఎక్కడికక్కడ శుభ్రత చర్యలు చేపట్టారు. రెడ్ జోన్ ప్రకటించిన ప్రాంతంలో డ్రోన్ తో హైపో క్లోరైడ్ లిక్విడ్ స్ప్రే చేశారు మున్సిపల్ సిబ్బంది. టవర్ సర్కిల్, మార్కెట్లతో పాటు జన సంచారం ఉన్న ప్రాంతాల్లో స్ప్రే చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామానికి వచ్చే దారులను.. ట్రాక్టర్లు అడ్డం పెట్టి మూసేశారు గ్రామస్థులు. దయచేసి మీరు మా ఊరికి రాకండి, మేము మీ ఊరికి రామంటూ గ్రామస్థులు దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నారు. బయటి నుంచి ఊళ్లోకి వచ్చే వారిని వెనక్కి పంపిస్తున్నారు.

Latest Updates