బువ్వపెట్టే సోలార్ బౌల్

తమిళనాడులోని విల్లు పురం జిల్లా. పుదుచ్చేరికి సమీపంలో ఉండే ఈ ప్రాంతం పచ్చని చెట్ల మధ్య ఉంటుంది. అక్కడ ‘అరోవిల్లె సోలార్ కిచెన్’ క్యాంటిన్ ఉంది. మిగతా క్యాంటిన్ లకు, దీనికి చాలా తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా.. వంట చేసేందుకు సోలార్ ఎనర్జీ తప్ప మరే ఇతర ఇంధనాన్ని వాడరు. ఒక బౌల్ (గిన్నె) లాంటిసోలార్ ప్యానెల్ ఆ క్యాంటిన్ రూఫ్ టాప్ మీద ఫిక్స్ చేసుకున్నారు. అందుకే దీన్ని ‘సోలార్ బౌల్’ అని కూడా పిలుస్తారు.

అరోవిల్లె సోలార్ కిచెన్ లో వంట పనులు ఉదయం ఆరు గంటలకే మొదలవుతాయి. పొలాల్లోంచి తెచ్చిన తాజా కూరగాయలు, గిన్నెలను, ప్లేట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వంటివి చాలామందిని అక్కడికి వెళ్లేలా చేస్తాయి. ఈ సోలార్ కిచెన్ ఫారిన్ టూరిస్ట్ లతో కిటకిటలాడుతూ ఉంటుంది.  లాక్ డౌన్ వల్ల ఇప్పుడు రద్దీ తగ్గినా, చాలామంది అక్కడికెళ్లి తింటున్నా రు. నాన్ వెజ్ వండరు కాబట్టి వెజిటేరియన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వంట మొత్తం సోలార్ ఎనర్జీ ఉపయోగించే చేస్తారు. ఎక్కువ మందిని ఇక్కడకు రప్పించే విషయాల్లో ఇదే ముఖ్యమైనది. నేషనల్ , ఇంటర్నేషనల్ టూరిస్ట్ లకు వడ్డించడంతోపాటుగా అరోవెల్లి సోలార్ కిచెన్ కు సమీపంగా ఉండే స్కూళ్లు, ఆఫీసులకు లంచ్ బాక్స్ లు పంపిస్తారు. ఫుడ్ మాత్రమే కాకుండా రూఫ్ టాప్ పైన ఉన్న సోలార్ బౌల్ చుట్టుపక్కలంతా చాలా ఫేమస్ . మూడు ఎకరాల్లో ఉన్న ఈ హోటల్ మీద పద్దెనిమిది మీటర్ల వెడల్పున్న సోలార్ బౌల్ వల్ల.. రోజుకు మూడు పూటలా సోలార్ ఎనర్జీతోనే వంట చేస్తారు. ఆ సోలార్ బౌల్ ను టాటా ఎనర్జీ రీసెర్చి ఇనిస్టిట్యూ ట్ తయారుచేసిం ది. దాన్ని అరోవెల్లి డిజైన్ కన్సల్టెంట్ సుహాసినీ అయ్యర్ హోటల్ టెర్రస్ పైన 1997, డిసెంబర్ నెలలో ఫిట్ చేసింది. అప్పట్నించి ఇప్పటివరకూ సోలార్ ఎనర్జీ ద్వారా జనరేట్ అయ్యే స్టీమ్ (ఆవిరి)తోనే వంట చేస్తున్నారు. ‘‘సోలార్ ప్యానెల్స్ ఉన్న బౌల్ మాత్రమే కాదు. సోలార్ చిమ్నీలు, నేచురల్ వెంటిలేషన్ ఈ సోలార్ బిల్టిం గ్ స్పెషాలిటీస్ సోలార్ థర్మల్ ఎనర్జీ నుం చి స్టీమ్ ని జనరేట్ చేసి.. దాన్ని స్టోర్ చేసేలా ఏర్పాట్లు చేశాం అంటోంది డిజైన్ కన్సల్టెం ట్ సుహాసిని.

లాక్ డౌన్ కి ముందు..

ఈ సోలార్ బౌల్ రోజుకు కనీసం వెయ్యిమందికి కడుపు నిండా అన్నం పెట్టేది. దాదాపు 540 స్కూళ్లకు భోజనాన్ని సరఫరా చేసేది. అలాగే ఎన్నో ఆఫీసులకు రోజుకు రెండొందల టిఫిన్లు పంపేది. దాదాపు 300 మంది తినేందుకు వీలుగా ఒక పెద్ద డైనిం గ్ హాల్ ఉంది ఇక్కడ. చెట్ల మధ్య కూర్చొని తినాలనుకునే వాళ్ల కోసం సర్వింగ్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఒక్క ఆదివారం తప్ప మిగతా అన్న రోజుల్లో ఉదయం ఆరు గంటల నుం చి సాయంత్రం ఏడున్నర వరకు ఈ అరోవిల్లె కిచెన్ తెరిచే ఉంటుంది. సోలార్ బౌల్ ని చూడ్డానికి మాత్రమే ఇక్కడకు వచ్చి భోజనం చేసేవాళ్లు చాలామంది ఉన్నారు.

అన్నింట్లో నూ ఎకో ఫ్రెండ్లీ

వంటకు సోలార్ పవర్ వాడినట్లే.. ఆ బిల్డింగ్ ని కూడా నేచురల్ మెటీరియల్స్ తోనే కట్టారు. వేస్ట్ వాటర్ రీసైక్లింగ్, కంపోస్టిం గ్ , రెయిన్ వాటర్ హార్వెస్టిం గ్ పద్ధతులు వాడి నీటిని ఆదా చేయడం అక్కడి స్పెషాలిటీ. గోడలకు కూడా మట్టి, ఇటుకలు ఎక్కువగా వాడారు. డెబ్భై శాతం వేస్ట్ వాటర్ ని రీసైకిల్ చేసి, దాన్ని గార్డెన్ లో చెట్లకు పెడతారు. సోలార్ బౌల్, నేచురల్ వెం టిలేషన్ వల్ల ఆ బిల్టిం గ్ లో కరెంట్ వాడకం చాలా తక్కువ. బిల్డింగ్ కట్టడానికి నేచురల్ మెటీరియల్ వాడటం వల్ల బయటి వేడిని గోడలు పీల్చుకుంటాయి. దాంతో లోపల ఏ కాలంలోనైనా చల్లగా ఉంటుంది. పైగా చుట్టూ చెట్లు ఉండటంతో గాలి కాలుష్యం ఉండదు. ఇక్కడ మరో స్పెషాలిటీ ఉంది. అది ఏంటంటే… ‘‘ఫుడ్ వేస్ట్ చేయొద్దు. అవసరం ఉన్నంతమేరకే పెట్టుకోండి’’ అని చెబుతూ ఒక బోర్డు ఉంటుంది. అలాగే దాని మీద… అంతకు ముం దు రోజు ఎన్ని కేజీల ఫుడ్ వేస్ట్ అయ్యిందనేది రాసి పెడతారు కూడా. అది ఒకలాంటి హెచ్చరికనే కదా.

బౌల్ ఎలా పని చేస్తుంది?

ఈ సోలార్ బౌల్ ని కాంపోజిట్ గ్రాఫైట్ , గోడల కోసం వాడే ఇటుకలతో కట్టారు. అలాగే 96 ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫెర్రో ఎలిమెంట్స్ , పదకొండు వేల మిర్రర్ రిఫ్లెక్టర్స్ తో గుండ్రటి బౌల్ గా తయారు చేశారు. అన్ని దిక్కులకు తిరిగేలా ట్రాకింగ్ బాయిలర్ ని కూడా బౌల్ కు అటాచ్ చేశారు. బాయిలర్ కి నీళ్లు పంప్ చేస్తే పైనుంచి పడే సూర్యరశ్మితో అవి ఆవిరిగా మారతాయి. దాన్ని కిచెన్ లోని హైబ్రిడైజ్డ్ బాయిలర్ కు ట్రాన్స్ పోర్ట్ చేస్తారు. బ్యాకప్ బాయిలర్ గా ఒక డీజిల్ ఫైర్డ్ బాయిలర్ కూడా ఉంటుంది. వర్షా కాలంలో ఎండ ఎక్కువగా ఉండదు. అందుకని సోలార్ ఎనర్జీ లేదని వంట ఆగిపోకుం డా దీన్ని వాడతారు. మిగతా రోజుల్లో ఉదయం తొమ్మిది, పది గంటల నుంచి ఈ బౌల్ వేడిని తీసుకుంటూనే ఉంటుంది. ఎక్కువ ఎండ ఏ డైరెక్షన్ లో ఉంటే అటు తిరుగుతుంది. ఈ టైమ్ లో డీజిల్ బాయిలర్ ని ఆఫ్ చేస్తారు.

Latest Updates