వార్నర్ సెంచరీ : దూకుడుగా ఆడుతున్న ఆసిస్

టాంటన్: వరల్డ్ కప్-2019లో భాగంగా బుధవారం పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో దూకుడుగా ఆడుతుంది ఆసిస్. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియాకు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్, వార్నర్ రాణించారు.

146 స్కోర్ దగ్గర ఫించ్(82) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్మిత్(10), మ్యాక్స్ వెల్(20) తక్కువ రన్స్ కే ఔట్ అయినప్పటికీ ..ఉన్నంతసేపు బౌండరీలతో ఊపు తెచ్చారు. దీంతో ఆస్ట్రేలియా రన్ రేట్ పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఓపెనర్ వార్నర్(104 నాటౌట్) సెంచరీ చేసుకున్నాడు. దీంతో వన్డేలో 15వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు వార్నర్. ప్రస్తుత రన్ రేట్ చూస్తుంటే ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసేలా కనిపిస్తుంది.

36 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 235 రన్స్ చేసింది. వార్నర్(104), షాన్ మార్ష్(3) రన్స్ తో క్రీజులో ఉన్నారు.

పాక్ బౌలర్లలో..అమీర్, అఫ్రీదీ, హఫీజ్ తలో వికెట్ తీశారు.

Latest Updates