ఆస్ట్రేలియా టెన్నిస్ లెజెండ్ అష్లే కూపర్ కన్నుమూత

కాన్బెర్రా: ఆస్ట్రేలియా టెన్నిస్ లెజెండ్ అష్లే కూపర్ కన్నుమూశారు. ఎనిమిదిసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ ఆష్లే కూపర్ 83 ఏళ్ళ వయసులో మరణించారని అక్కడి స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ శుక్రవారం రాత్రి ప్రకటించింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న కూపర్ తుదిశ్వాస విడిచినట్లు తెలిపింది. 1950 లలో నంబర్ వన్ ర్యాంకింగ్ ఆటగాడిగా గుర్తింపు పొందిన అష్లే కూపర్ ఆస్ట్రేలియన్, వింబుల్డన్, యూఎస్ చాంపియన్ షిప్​తో సహా.. ఆస్ట్రేలియన్ పురుషుల మెన్స్ విభాగంలో నాలుగు గ్రాండ్ స్లామ్స్ సింగిల్స్ టైటిల్స్, నాలుగు డబుల్స్ గెలుచుకున్నారు.

Latest Updates