సిడ్నీ టెస్టులో ఆసీస్ 338 పరుగులకు ఆలౌట్

సిడ్నీలో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 338 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు నష్టపోయి 166 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్.. మరో 172 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ చెలరేగి 226 బంతుల్లో 16 ఫోర్లతో 131 పరుగులు చేశారు. మరో బ్యాట్‌మన్ లబూషేన్ 196 బంతుల్లో 11 ఫోర్లతో 91 పరుగులు చేశాడు. రహానే బౌలింగ్‌లో ఆసీస్ 206 పరుగుల వద్ద లబూషేన్ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లేవరూ క్రీజులో నిలవలేకపోయారు. దాంతో స్మిత్‌కు జోడీ కరువైంది. అయినా కూడా చివరి వరకూ పోరాడి ఆసీస్ స్కోరును 338 పరుగులకు చేర్చాడు. జడేజా నాలుగు వికెట్లు, బుమ్రా, సైనీ చేరో రెండు వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు.

తర్వాత టీంఇండియా ప్లేయర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ బ్యాటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం టీంఇండియా వికెట్ నష్టపోకుండా 9 ఓవర్లలో 26 పరుగులు చేసింది.

For More News..

సీఎం రివ్యూ తర్వాత యాదాద్రిలో కట్టింది క్యూలైన్లే

వేరే రాష్ట్రాల్లో వడ్ల కేంద్రాలు చూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా

మీ ఫోన్ మీ ఇష్టం.. కస్టమర్లకు నచ్చినట్లు ఫోన్ తయారుచేసిస్తామంటున్న ఇండియన్ మొబైల్ కంపెనీ

Latest Updates