హాట్రిక్ తో చెలరేగిన బౌల్ట్ : ఆస్ట్రేలియా స్కోర్-243

australia-have-still-finished-on-243-9

వరల్డ్ కప్-2019లో భాగంగా శనివారం న్యూజిలాండ్ తో జరుగుతుతన్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా తడబడింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసిస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 రన్స్ మాత్రమే చేయగలిగింది. కివీస్ బౌలర్ల ధాటికి ఆసిస్ ప్లేయర్లు తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు.

ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ఉస్మాన్ ఖవాజా (88), అలెక్స్ కారే (71 )లు రాణించారు.

న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు తీయగా, లాకీ ఫెర్గుసన్, జేమ్స్ నీషమ్‌లు చెరో 2 వికెట్లు తీశారు.  కేన్ విలియమ్సన్‌కు 1 వికెట్ దక్కింది.

బౌల్ట్ హ్యాట్రిక్…

ఆసీస్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ హ్యాట్రిక్ తీశాడు. చివరి ఓవర్లో 3, 4, 5 బంతులకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఖవాజా, స్టార్క్, బెహ్రెన్‌డార్ఫ్‌లను బౌల్ట్ వరుసగా పెవిలియన్ పంపాడు. ఈ క్రమంలో బౌల్ట్ వరల్డ్ కప్‌లలో హ్యాట్రిక్ సాధించిన తొలి న్యూజిలాండ్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు.