5 వేల ఒంటెలను చంపేసిన ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా అన్నంత పనీ చేసింది. 5 రోజుల్లో 5 వేలకు పైగా ఒంటెలను కాల్చి చంపేసింది. కొద్ది రోజుల క్రితం 10 వేల ఒంటెలను చంపేస్తామని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనంగు పిజంజజర యంకున్యిజజర (ఏపీవై)లో హెలికాప్టర్ల ద్వారా వాటిని తుపాకులతో కాల్చి చంపేశారు. ఐదురోజుల పాటు చేపట్టిన కార్యక్రమం ఆదివారంతో ముగిసిందని మంగళవారం అధికారులు ప్రకటించారు. ఇప్పటికే బుష్​ఫైర్స్​తో జనం అల్లాడిపోతున్నారని, కరువుతో కొన్ని ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇలాంటి టైంలో నీళ్ల కోసం ఒంటెలు ఇళ్ల మీదకు వచ్చి పడుతున్నాయని, అందుకే వేరే దారి లేక వాటిని చంపేయాల్సి వచ్చిందని వివరించారు. ‘‘జంతు హక్కుల కార్యకర్తల ఆవేదనను మేం అర్థం చేసుకోగలం. కానీ, వాళ్లు అసలు పరిస్థితులను అర్థం చేసుకోవట్లేదు. మారుమూల ప్రాంతంలోని ఊళ్లపై ఒంటెలు నీళ్ల కోసం దాడులకు దిగుతున్నాయి. జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. మా మొదటి ప్రాధాన్యం జనాలకే. ఇక్కడి సమస్యలను అర్థం చేసుకుని జనాలకు అత్యవసరమయ్యే నీటి వనరులు, ఇతర మౌలిక వసతులను కాపాడుకోవడం కోసం వాటిని చంపేయాల్సి వచ్చింది. పిల్లలు, పెద్దలు, చెట్లు, పుట్టలను కాపాడుకోవడం మా బాధ్యత’’ అని ఏపీవై జనరల్​ మేనేజర్​ రిచర్డ్​ కింగ్​ చెప్పారు.

Latest Updates