ఫండ్ రైజింగ్ కోసం..338 అడుగుల పిజ్జా

ఫొటో చూశారుగా ఎంత పెద్ద పిజ్జానో! ఆస్ట్రేలియాలోని పెల్లి గ్రినిస్ ​ఇటాలియన్ రెస్టారెంట్ ఈ పిజ్జాను తయారు చేసింది. ఇందుకు 90 కిలోల పిండిని, కన్వేయర్​ఓవెన్ ను ఉపయోగించింది. దీని తయారీకి 4గంటల సమయం పట్టింది. అయితే ఇదేం రికార్డు కోసం చేయలేదు. ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చును ఆర్పేందుకు కష్టపడుతున్న ఫైర్ ఫైటర్స్ కోసం ఈఫండ్ రైజింగ్ ​ఈవెంట్ నిర్వహించారు. ఈ పిజ్జాను 4వేల ముక్కలు చేసి పంపిణీ చేశారు. ఈవెంట్ కు దాదాపు 3వేల మంది హాజరై మనీ డొనేట్ చేశారు. ఈ మనీని న్యూసౌత్ వేల్స్ రూరల్ ఫైర్​ సర్వీస్​ డిపార్ట్​మెంట్ కు అంద జేయనున్నా రు. ‘‘ ఇది ప్రపంచరికార్డు అయుండకపోవచ్చు. కానీ మరిన్ని నిధుల సేకరణకు ఇది హెల్ప్‌ చేసింది’’ అని ఆర్గనైజర్లు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates