ఉమెన్స్ టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే నాలుగుసార్లు కప్ గెలిచిన ఆసీస్.. ఐదోసారి కూడా గెలవాలని ఆశపడుతోంది. కాగా.. ఒక్కసారి కూడా కప్ దక్కించుకోని ఇండియా.. ఎలాగైనా కప్ గెలిచి రికార్డు సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. టీ20ల్లో ఇప్పటివరకు ఆసీస్, భారత టీంలు 19సార్లు తలపడగా.. ఇండియా కేవలం 6 సార్లు మాత్రమే గెలవగా.. ఆసీస్ మాత్రం ఏకంగా 13 సార్లు గెలిచింది. ఇటువంటి రికార్డున్న ఆసీస్ మీద భారత మహిళా టీం గెలుస్తుందేమో చూడాలి. గెలిస్తే మాత్రం మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కప్ చరిత్రలో చాలా స్పెషల్‌గా నిలవనుంది.

For More News..

మారుతీరావు సూసైడ్‌నోట్‌లో ఏముంది?

Latest Updates