బ్రిస్బేన్ టెస్ట్‌.. ఆసీస్ 274/5

భారత్ ఆసీస్ మధ్య ఆఖరి టెస్టు ఇంట్రెస్టింగా సాగుతోంది. తొలి రోజు ఐదు వికెట్లు కోల్పోయి… 274 రన్స్ చేసింది ఆసీస్. లబుషేన్ సెంచరీ కొట్టగా… మాథ్యూవేడ్ 45 పరుగులతో 45 రన్స్ తో పర్వాలేదనిపించాడు. లబుషేన్ 204 బాల్స్ లో తొమిది ఫోర్లతో 108 పరుగులు చేశాడు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీమిండియా బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీయగా… శార్థూల్ ఠాకుర్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. ఆట ముగిసే సమయానికి కామెరాన్  గ్రీన్  28, కెప్టెన్ టిమ్ పైన్ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Latest Updates