ఫస్ట్ వన్డే: భారత్ పై ఆస్ట్రేలియా విజయం

సిడ్నీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ వన్డేలో భారత్ ఓటమిపాలైంది. ఆసిస్ 66 రన్స్ తేడాతో విజయం సాధించింది.  టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి  374 రన్స్ చేసింది.  కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌(114) స్టీవ్‌ స్మిత్‌(105) సెంచరీలతో చెలరేగారు.  వార్నర్‌(69) హాఫ్ సెంచరీ .. చివర్లో మాక్స్‌వెల్‌(45) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఆసిస్ బిగ్   స్కోరు చేసింది. భారత్ బౌలర్లలో మహ్మద్‌ షమీ (3), బుమ్రా, సైనీ, చాహల్‌ తలో వికెట్‌ తీశారు.

లక్ష్య చేధనలో హార్దిక్‌ పాండ్య(90) శిఖర్‌ ధావన్‌(74) తప్ప మిగతా ప్లేయర్లు రాణించలేక పోయారు. 8 వికెట్లు కోల్పోయిన భారత్ 308 రన్స్ చేసి ఓడింది. దీంతో ఆసీస్‌ 1-0తో లీడ్ లో నిలిచింది. సెకండ్ వన్డే ఆదివారం సిడ్నీలో  జరగనుంది.

Latest Updates