స్మిత్, కౌల్టర్ హీరోయిక్ ఇన్నింగ్స్… విండీస్ టార్గెట్ 289

  • బ్యాటింగ్ లో దుమ్ములేపిన బౌలర్ కౌల్టర్ నైల్

నాటింగ్ హామ్ లో వెస్టిండీస్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా హీరోయిక్ ఆట తీరు చూపింది. 79/5 స్కోరుపై ఉన్నప్పుడు వందలోపే ఆలౌట్ అవుతుందనుకున్నారంతా. కానీ ఆ జట్టు.. 288 పరుగులు స్కోరు చేసి వావ్ అనిపించింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు డెడికేషన్ చూపడంతో… పడిలేచి నిలబడింది ఆస్ట్రేలియా. క్రికెట్ లోని మజాను చూపింది.

టాస్ గెలిచి ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు దించింది వెస్టిండీస్. ఆరంభంలో కరీబియన్ బౌలర్లు భీకరమైన బౌలింగ్ తో కంగారూ టాప్ ఆర్డర్ ను కంగారుపెట్టేశారు. 79 రన్స్ కే టాప్ ఆర్డర్ లోని ఐదు వికెట్లను పడగొట్టారు. వార్నర్ 3, ఫించ్ 6, ఖవాజా 13, మాక్స్ వెల్ 0, స్టోనీస్ 19 రన్స్ చేసి ఔటయ్యారు. ఐతే… మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ కు బ్యాక్ బోన్ లా నిలిచాడు. మిడిలార్డర్, టెయిలెండర్లతో కలిసి జట్టు స్కోరును ముందుకు నడిపాడు. ఓపిగ్గా ఆడిన స్మిత్.. 103 బాల్స్ లో.. 73 రన్స్ చేసి ఔటయ్యాడు.

బ్యాటింగ్ లో దుమ్ములేపిన బౌలర్ కౌల్టర్ నైల్

స్మిత్ తో కలిసి వికెట్ కీపర్ అలెక్స్ క్యారే(45) కీలకమైన భాగస్వామ్యం అందించి… ఆస్ట్రేలియాను సేఫ్ జోన్ లో పెట్టాడు. బౌలర్ కౌల్టర్ నైల్ దుమ్ములేపే ఇన్నింగ్స్ ఆడాడు. 60 బాల్స్ లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో.. 92 రన్స్ చేసి లాస్ట్ బట్వన్ ఓవర్ లో ఔటయ్యాడు.  ఓ బౌలర్ అయినప్పటికీ ట్వంటీ ట్వంటీ తరహాలో భారీ షాట్లు ఆడాడు. 49 ఓవర్లలో 288 రన్స్ చేసి ఆలౌటయ్యింది.

బ్రాత్ వైట్ 3 వికెట్లు తీయగా.. థామస్, కాట్రెల్, రసెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. హోల్డర్ కు ఒక వికెట్ పడింది.

Latest Updates