న్యూస్ కంటెంట్​కు గూగుల్, ఫేస్ బుక్ పైసలియ్యాలె

  • కొత్త రూల్స్ తెస్తామంటున్న ఆస్ట్రేలియా

కాన్భెర్రా: గ్లోబల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అయిన గూగుల్, ఫేస్‌బుక్‌లు న్యూస్ కంటెంట్​ను అందిస్తున్నందుకు ప్రభుత్వానికి పరిహారం చెల్లించాల్సి వస్తుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ ట్రెజరర్ జోష్ ఫ్రైడెన్‌బర్గ్ మాట్లాడుతూ.. ఈ సంస్థల నుంచి వెలువడుతున్న వార్తలకు, జర్నలిస్టిక్ కంటెంట్​కు తగిన పరిహారం చెల్లించేందుకు జులై నెలలో కొత్త గైడ్ లైన్స్ విడుదల చేస్తామని చెప్పారు. డిజిటల్ ఫ్లాట్​ఫామ్స్ అందిస్తున్న న్యూస్ కంటెంట్​కు తప్పనిసరిగా డబ్బు చెల్లించేలా కమిషన్ డ్రాఫ్ట్ రూల్స్ అమలు చేయనుందన్నారు.

యాడ్స్ ఆదాయం కొల్లగొట్టినయ్
కరోనా ఎఫెక్టుతో దేశంలో డజన్ల కొద్ది.. వార్తా పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు మూతపడ్డాయని, అదే సమయంలో గూగుల్,ఫేస్ బుక్ కంపెనీలు వార్తలు, యాడ్స్ ను ప్రసారం చేయడం ద్వారా లాభాలు పొందాయని ఫ్రైడెన్ బర్గ్ చెప్పారు. క్లాసిఫైడ్ యాడ్స్ మినహాయించి ఆన్ లైన్ ప్రకటనల ఖర్చులో 47 శాతం గూగుల్, 24 శాతం ఫేస్ బుక్ ఆదాయం సమకూర్చుకున్నాయని అన్నారు. కరోనా ఎఫెక్టు దేశంలో అన్ని వ్యాపారాలపై పడిందని, ప్రకటనల నుంచి ఆదాయం తగ్గుతున్న సమయంలో వార్తా పరిశ్రమలను ఆదుకుకునేందుకు తాము 100 మిలియన్ డాలర్ల నిధులు కేటాయించామన్నారు.అయినా అవి ఏ మాత్రం ఆ పరిశ్రమలను నిలబెట్టలేకపోయాయన్నారు. గూగుల్ సెర్చ్ రిజల్ట్ లో 10 శాతం న్యూస్ కంటెంటే ఉందని సర్వేలు చెబుతున్నాయన్నారు. కాబట్టి ఫేస్ బుక్, గూగుల్ కంపెనీలు న్యూస్ ఏజెన్సీలతో సంబంధం లేదని చెప్పే పరిస్థితి ఉండదన్నారు. వాటి నుంచి కంపెన్సేషన్ వసూలు చేయడంలో తాము యూనివర్సల్ లీడర్ గా అవతతిస్తామన్నారు. దీనిపై గూగుల్, ఫేస్ బుక్ కంపెనీలు ఇంకా స్పందించలేదు.

Latest Updates