బ్యాడ్ న్యూస్..రోహిత్, ఇషాంత్ ఔట్​!

 

న్యూఢిల్లీ:  బోర్డర్‌‌–గావస్కర్‌‌ ట్రోఫీని డిఫెండ్‌‌ చేసుకోవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియాకు బ్యాడ్‌‌ న్యూస్‌‌.  ఆస్ట్రేలియాతో వచ్చేనెల17 నుంచి జరిగే నాలుగు మ్యాచ్‌‌ల టెస్ట్‌‌ సిరీస్‌‌కు ఇండియా ఇద్దరు కీలక ప్లేయర్ల సేవలను కోల్పోనుంది. స్టార్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ రోహిత్‌‌ శర్మ, సీనియర్‌‌ పేసర్‌‌ ఇషాంత్‌‌ శర్మ  ఈ సిరీస్‌‌లో తొలి రెండు మ్యాచ్‌‌లకు దూరం కావడం దాదాపు ఖాయమైంది.  క్వారంటైన్‌‌ రూల్స్‌‌ నేపథ్యంలో మిగిలిన రెండు మ్యాచ్‌‌లకు కూడా వీళ్లు అందుబాటులో ఉండటం డౌటేనని బీసీసీఐ వర్గాలు  అంటున్నాయి. వీరిద్దరూ మ్యాచ్‌‌ ఫిట్‌‌నెస్‌‌ సాధించేందుకు మరింత సమయం అవసరం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.  మూడు, నాలుగు రోజుల్లో ఫ్లైట్‌‌ ఎక్కకుంటే రోహిత్‌‌, ఇషాంత్‌‌ ..ఆస్ట్రేలియాతో టెస్ట్‌‌ సిరీస్‌‌  మిస్‌‌ అవుతారని హెడ్‌‌ కోచ్‌‌ రవిశాస్త్రి కూడా ఆదివారం కామెంట్‌‌ చేశాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సిరీస్‌‌ మొత్తానికి దూరమైనట్టేనని అంతా భావిస్తున్నారు.  హ్యామ్‌‌స్ట్రింగ్‌‌ ఇంజ్యురీతో రోహిత్‌‌, పక్కటెముకల్లో గాయంతో బాధపడుతున్న ఇషాంత్‌‌ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌‌ క్రికెట్‌‌ అకాడమీ(ఎన్‌‌సీఏ)లో రిహాబిలిటేషన్‌‌లో ఉన్నారు. కానీ, ఎన్‌‌సీఏ నుంచి బోర్డుకు అందిన రిపోర్టు ప్రకారం ఈ క్రికెటర్లు టెస్ట్‌‌ సిరీస్‌‌ నాటికి మ్యాచ్‌‌ ఫిట్‌‌నెస్‌‌ సాధించలేరని బీసీసీఐకి చెందిన ఓ అధికారి మంగళవారం వెల్లడించారు. ‘ఎన్‌‌సీఏ ఇచ్చిన రిపోర్ట్‌‌ ప్రకారం రోహిత్‌‌, ఇషాంత్‌‌ మ్యాచ్‌‌ ఫిట్‌‌నెస్ సాధించాలంటే కనీసం  మరో 3 నుంచి 4 వారాలు అవసరం. ఆ లోపే ఆస్ట్రేలియా వెళ్లినా క్వారంటైన్‌‌ రూల్స్‌‌తో ఇబ్బంది ఉంటుంది.

ఎందుకంటే వాళ్లు కమర్షియల్‌‌ ఫ్లైట్‌‌లో జర్నీ చెయ్యాలి. దాంతో క్వారంటైన్‌‌ రూల్స్‌‌ టఫ్‌‌ అవుతాయి. మిగిలిన జట్టు క్వారంటైన్‌‌ టైమ్‌‌లో ట్రెయినింగ్‌‌ చేసినట్టు వారికి సాధ్యం కాదు. క్రికెట్‌‌ ఆస్ట్రేలియా(సీఏ) తమ గవర్నమెంట్‌‌ను ఒప్పిస్తే ట్రెయినింగ్‌‌ చేసుకునే చాన్స్‌‌ దొరుకుతుంది’ అని ఆ అధికారి అన్నారు.   కాగా, ఇషాంత్‌‌ ఫిట్‌‌గానే ఉన్నాడని.. కానీ అతను టెస్ట్‌‌ మ్యాచ్‌‌కు కావాల్సిన ఫిట్‌‌నెస్‌‌ సాధించాలంటే నాలుగు వారాలు పని చేయాల్సి ఉంటుందని  బోర్డుకు చెందిన మరో అధికారి అన్నారు. అంతేకాక ఒకట్రెండు రోజుల్లో ఆసీస్‌‌ ఫ్లైట్‌‌ ఎక్కగలిగితేనే జనవరి 7న మొదలయ్యే మూడో టెస్ట్‌‌కు ఇషాంత్‌‌ అందుబాటులో ఉంటాడని ఆ అధికారి తెలిపారు. మరోపక్క రోహిత్‌‌ శర్మ పరిస్థితి వేరేలా ఉంది. హ్యామ్‌‌స్ట్రింగ్‌‌ ఇంజ్యురీతో బాధపడుతున్న హిట్‌‌మ్యాన్‌‌కు డిసెంబర్‌‌ రెండో వారంలో ఫిట్‌‌నెస్‌‌ క్లియరెస్స్‌‌ వచ్చే చాన్సుంది. అక్కడి నుంచి  రెండు వారాలకు అతని ఫిట్‌‌నెస్‌‌పై తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రోహిత్‌‌ టెస్ట్‌‌ సిరీస్‌‌ ఆడాలంటే  డిసెంబర్‌‌ 8 లోపు ఆసీస్‌‌ చేరుకోవాల్సిందే. అలాగైతేనే 14 రోజుల క్వారంటైన్‌‌ పూర్తి చేసుకుని  డిసెంబర్‌‌ 22 కల్లా  ట్రెయినింగ్‌‌ స్టార్ట్‌‌ చేస్తాడు. రోహిత్‌‌, ఇషాంత్‌‌ ఎప్పుడు బయలుదేరినా సరే ఫస్ట్‌‌ టెస్ట్‌‌కు ముందు జరిగే రెండు వామప్‌‌ మ్యాచ్‌‌లకు మాత్రం  ఆడలేరు. దీంతో వీరి విషయంలో బోర్డు, సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

బ్యాకప్‌‌గా శ్రేయస్‌‌

పెటర్నిటీ లీవ్‌‌తో ఫస్ట్‌‌ టెస్ట్‌‌ తర్వాత విరాట్‌‌ కోహ్లీ స్వదేశానికి రానుండడం, రోహిత్‌‌ శర్మపై సస్పెన్స్‌‌ కొనసాగుతుండడంతో  టీమిండియా మేనేజ్‌‌మెంట్‌‌ బ్యాకప్‌‌ ప్లాన్‌‌పై దృష్టి సారించింది. రోహీత్‌‌ అందుబాటులోకి రాకుంటే శ్రేయస్‌‌ అయ్యర్‌‌తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తోంది. ఆసీస్‌‌తో వైట్‌‌ బాల్‌‌ సిరీస్‌‌లకు ఎంపికైన అయ్యర్‌‌ను  ఇందుకోసం రిజర్వ్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గా టెస్టు టీమ్‌‌లోకి తీసుకోవాలని అనుకుంటోంది. ఇప్పటిదాకా 54 ఫస్ట్‌‌ క్లాస్‌‌ గేమ్స్‌‌ ఆడిన అయ్యర్‌‌ 52.18 యావరేజ్‌‌తో 4592 రన్స్‌‌ చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 23 హాఫ్‌‌ సెంచరీలున్నాయి. దాంతో, ఇదివరకే ఒకసారి అయ్యర్‌‌ టీమిండియా పిలుపు అందుకున్నాడు. 2016–17లో స్వదేశంలో ఆసీస్‌‌ జరిగిన టెస్ట్‌‌ సిరీస్‌‌లో గాయపడిన విరాట్‌‌ కోహ్లీకి బ్యాకప్‌‌గా అయ్యర్‌‌ను సెలెక్ట్‌‌ చేశారు. కానీ ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో అవకాశం దక్కలేదు. అప్పట్నించి ఈ యంగ్‌‌స్టర్ టెస్ట్‌‌ అరంగేట్రం కోసం వెయిట్‌‌ చేస్తున్నాడు.  మరోపక్క ఇషాంత్‌‌ కు రీప్లేస్‌‌మెంట్‌‌గా  టీమిండియా ముందు చాలా ఆప్షన్స్‌‌ కనిపిస్తున్నాయి. బుమ్రా, షమీ, ఉమేశ్‌‌, సైనీ,   సిరాజ్‌‌తో టెస్టు జట్టు పేస్‌‌ లైనప్‌‌ బలంగా ఉంది.  వైట్‌బాల్‌ సిరీస్‌లకుసెలెక్ట్‌ అయిన  దీపక్‌ చహర్‌, శార్దూల్‌, నటరాజన్‌లో ఒకరికి టెస్టుల్లో చాన్స్​ రావొచ్చు.

Latest Updates