స్మృతి ఒంటరి పోరాటం వృధా

మెల్‌‌బోర్న్: ఉమెన్స్ టీ20 ట్రై సిరీస్‌ ను భారత్ జస్ట్ మిస్ చేసుకుంది. ఆస్ట్రేలియాతో నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ చివరివరకు పోరాడి ఓడింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 రన్స్ చేసింది.  అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్.. ఆచితూచి ఆడుతూ టార్గెట్ ను ఫినిష్ చేసేలా కనిపింది. ఓపెనర్ గా వచ్చిన స్మృతి మంధాన(66) మరోసారి రెచ్చిపోయి ఆడింది. హాఫ్ సెంచరీతో చెలరేగింది.

అయితే 14.2 ఓవర్ లో భారత్ స్కోర్ 115/3 దగ్గర సూపర్ ఫామ్ లో ఉన్న మంధాన ఔట్ అయ్యింది. అంతే భారత్ కు దురదృష్టం ఇలా వచ్చింది. ఆ తర్వాత టపటపా వికెట్లు కోల్పోయాయి. మంధాన ఔట్ అయిన తర్వాత ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో ఉండలేక పోయారు. చివరివరకు నువ్వానేనా అనేలా సాగిన మ్యాచ్ లాస్ట్ కి ఆస్ట్రేలియా వైపుకి తిరిగింది. భారత్ 20 ఓవర్లలో 144 రన్స్ చేసి ఆలౌటైంది. దీంతో 11 రన్స్ తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.. ఉమెన్స్ టీ20 ట్రై సిరీస్‌ ను కైవసం చేసుకుంది.

ఆస్ట్రేలియా బౌలర్లలో.. , జోనెసన్ 5 వికెట్లతో భారత్ కు షాక్ ఇచ్చింది.

Latest Updates