రాములో రాములా పాట‌కు వార్న‌ర్ స్టెప్పులు

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మ‌రోసారి అల్లు అర్జున్ పాట‌కి స్టెప్పులేశాడు. లాక్ డౌన్ కార‌ణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న వార్న‌ర్ టిక్ టాక్ వీడియోస్ తో రెచ్చిపోతున్నాడు. ఆ మ‌ధ్య ‘అల వైకుంఠపురం’ సినిమాలోని ‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా’ పాటకు భార్యతో కలిసి డాన్స్ చేసిన వార్న‌ర్… తాజాగా అందులోని మ‌రో పాట ‘రాములో రాములా..’ కు కుటుంబంతో క‌లిసి చిందులేశాడు.

టిక్‌టాక్‌లో ఈ వీడియో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన భార్యతో కలిసి వార్నర్ హుషారుగా స్టెప్పులేస్తుండగా, కూతురు కూడా బుడిబుడి స్టెప్పులు వేసింది. ఇంత‌కు ముందు మ‌హేష్ బాబు పోకిరి సి‌నిమాలోని ‘ఒక్క‌సారి కమిటైతే నా మాటే నేనే విన‌ను ‘ అంటూ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ చెప్పి తెలుగు అభిమానుల‌ను అల‌రించాడు వార్న‌ర్. తాజాగా చేసిన‌ రాములో రాములా పాట‌కు అల్లు అర్జున్ కూడా రీ ట్వీట్ చేసాడు. వార్న‌ర్ కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు.

 

Latest Updates