ఇండియా సిరీస్ కు ట్రావెల్ బ్యాన్ నుంచి ఎక్సెప్షన్?

మెల్‌‌‌‌బోర్న్:  కరోనా కారణంగా క్రికెట్ పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పట్లో ఆట మొదలయ్యే అవకాశం లేదని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా తేల్చి చెప్పాడు.  అయితే, ఈ ఏడాది చివర్లో  టీమిండియా.. ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌ వరకు పరిస్థితి మారుతుందని  అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ దేశానికి వచ్చే ఇండియా టీమ్ కోసం ఆస్ట్రేలియా గవర్నమెంట్  ట్రావెల్ ఎక్సెప్షన్స్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవేళ ఈ సిరీస్ జరగకపోతే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) దాదాపు 300 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు నష్టపోనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ట్రావెల్‌‌‌‌ బ్యాన్‌‌‌‌ విషయంలో ఇండియాకు సడలింపు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఫైనాన్షియల్ ప్రెజర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సీఏ.. తమ ఎంప్లాయ్స్‌‌‌‌ శాలరీల్లో 80 శాతం కోత పెట్టింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్– జనవరి జరిగే మధ్య ఆసీస్‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌లో  3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల్లో  ఇండియా తలపడనుంది. లిమిటెడ్‌‌‌‌ ఓవర్ల సంగతి పక్కనబెడితే కనీసం డిసెంబర్–జనవరి మధ్య టెస్ట్ సిరీస్ అయినా జరిగితే ఫైనాన్స్ విషయంలో కొంత రిలీఫ్ దక్కుతుందని సీఏ భావిస్తోంది.

ప్రస్తుతానికి సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ వరకు ఆస్ట్రేలియా బోర్డర్స్‌‌‌‌  క్లోజ్ చేశారు.  ఆ తర్వాత కూడా  ట్రావెల్ రిస్ట్రిక్షన్స్‌‌‌‌ను ఎక్స్‌‌‌‌టెండ్ చేసే అవకాశం ఉంది. ‘నెక్ట్స్ సమ్మర్‌‌‌‌‌‌‌‌లో తమ దేశ టూర్‌‌‌‌‌‌‌‌ కు వచ్చే ఇండియా టీమ్‌‌‌‌కు  ఎక్సెప్షన్స్ ఇవ్వాలన్న అంశాన్ని గవర్నమెంట్ సీరియస్‌‌‌‌గా ఆలోచించనుంది. అప్పుడే  క్రికెట్ ఆస్ట్రేలియా 300 మిలియన్ డాలర్ల   నష్టాన్ని తప్పించుకుంటుంది.  తమకు ఎంతో లాభం తెచ్చిపెట్టే  టీమిండియా టూర్ విషయంలో ట్రావెల్ ఎక్సెప్షన్ విషయంలో  గవర్నమెంట్‌‌‌‌ నుంచి సీఏకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది’ అని క్రిక్‌‌‌‌ఇన్ఫో వెబ్‌‌‌‌సైట్ పేర్కొన్నది. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో బ్రాడ్‌‌‌‌కాస్ట్ రైట్స్ నుంచి భారీ మొత్తం సహా 500 మిలియన్ డాలర్ల  రెవెన్యూ వస్తుందని సీఏ అంచనా వేసింది. కరోనా నేపథ్యంలో స్టేడియాలకు ప్రేక్షకులను అనుమతించకున్నా  ఈ మొత్తంలో 50 మిలియన్ల లోపే  కోల్పోవాల్సి  వస్తుంది.. ఒకవేళ టీమిండియా టూర్‌‌‌‌‌‌‌‌ రద్దయితే మాత్రం భారీ మొత్తంలో నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, దేశంలో స్పోర్టింగ్​ యాక్టివిటీని మళ్లీ స్టార్ట్ చేసే విషయంలో  అన్ని  అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆస్ట్రేలియా ప్రధాని పేర్కొనడం సీఏకు కాస్త ఊరటనిచ్చే అంశం.

ఐదో టెస్టుపై ఇప్పుడే చెప్పలేం:  బీసీసీఐ అధికారి

తమతో టెస్టు సిరీస్‌‌‌‌లో అదనంగా ఒక మ్యాచ్ ఆడాలన్న క్రికెట్ ఆస్ట్రేలియా ప్రపోజల్‌‌‌‌పై  ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ‘ఆస్ట్రేలియాతో మేం ఐదు టెస్టులు ఆడేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పడం తొందరపాటు అవుతుంది. ఇప్పటికైతే ఏడెనిమిది నెలల తర్వాత ఏం జరుగుతుందని మేం  ఆలోచించే పరిస్థితి కూడా  లేదు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఎవరికి తెలుసు?.  అందువల్ల ముందుగా ఈ గండం నుంచి మనం ఎలా గట్టెక్కుతామో చూడాలి. ఆ తర్వాతే ఆట గురించి ఆలోచిద్దాం’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

 

Latest Updates