ఆస్ట్రేలియా ఓపెన్‌ ప్రైజ్‌ మనీ పెరిగింది

వచ్చే ఏడాది(2020) జనవరిలో జరగబోయే మొదటి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌ ప్రైజ్‌ మనీ భారీగా పెరిగింది. వరల్డ్ వైడ్ గా ఈ మెగా టోర్నీకి ఎంతో క్రేజ్‌ ఉంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్వహకులు ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ ప్రైజ్‌మనీని పెంచుతున్నట్లు ప్రకటించారు. గతేడాది తో పోల్చుకుంటే 13.6 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు టోర్నీ నిర్వాహకులు. దీంతో మొత్తం ప్రైజ్‌మనీ రూ.350 కోట్లకు చేరుకుంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలకు నగదు బాహుమతి రూపంలో రూ.20 కోట్లు దక్కనుంది. ఇక తొలి రౌండ్‌లో నిష్క్రమించే వారికి రూ.44 లక్షలు, రెండో రౌండ్‌లో నిష్క్రమించే వారికి రూ.63 లక్షలు ఇవ్వనున్నారు. రౌండ్‌ రౌండ్‌కు నగదు మొత్తం పెరుగుతూపోతుంది. దీని ద్వారా చాలా మంది ఆటగాళ్లకు మరింత ఆదాయం సమకూరుతుందన్నారు టోర్నీ డైరెక్టర్‌ క్రేగ్‌ టిలే. జనవరి 20న మెల్‌బోర్న్ పార్కులో ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుంది.

Latest Updates