కరోనా: చైనాపై యాక్షన్ తీసుకోండి… WHOను కోరిన ఆస్ట్రేలియా PM

మెల్ బోర్న్: కరోనా వైరస్‌ను వ్యాప్తిచేసిన చైనాపై యాక్షన్ తీసుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ను(WHO), యునైటెడ్ నేషన్స్‌ (UN)ను కోరారు ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి స్కాట్ మురిషన్. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన… ప్రపంచం ప్రమాదంలో పడటానికి చైనాలోని మాంసం అమ్మే మార్కెట్లే కారణమని చెప్పారు. ఇవి ప్రపంచ మానవాళికి పెను సవాళ్లుగామారాయని చెప్పారు.

2019 డిసెంబర్‌లో చైనాలో పుట్టిన కరోనా వైరస్… చనిపోయిన జంతువుల నుంచి మనుషులకు వచ్చిందని తెలిపారు. కరోనా వైరస్ వలన ప్రపంచవ్యాప్తంగా 175దేశాలలో లక్షలాదిగా ప్రజలు రోగం బారిన పడ్డారని, ఇప్పటికే 51వేలమంది చనిపోయారని ఇటలీకి చెందిన జాన్స్ హాప్కిన్స్ తెలిపినట్లు ఆయన చెప్పారు.

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కుంటున్న విపత్తుకు కారణం చైనాలోని మాంసం అమ్ముతున్న దుకానాలేనని అన్నారు స్కాట్ మారిషన్. ఆ మార్కెట్లే ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను అతలాకుతలం చేశాయని చెప్పారు. ఆ మాంసం దుకానాలలో   పాడయిపోయిన మాంసం అక్కడి ప్రజలు తినడం వల్లే కరోనా వరస్ వ్యాపించిందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలు, ఇతర ఇంటర్నేషనల్ సంస్థలు విపత్తును అర్థంచేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని తాను కోరుతున్నట్లుగా చెప్పారు. ఎందుకంటే ప్రపంచం హెల్తే క్రైసిస్‌లో పడిపోయిందని అన్నారు.

అమెరికాలో ఇప్పటికే 2లక్షల 45వేల ఐదువందల మందికి కరోనా సోకిందని అందులో 6వేల మంది చనిపోయారని చెప్పారు స్కాట్ మురిషన్. ఇదే విధమైన పరిస్థితులు ఇటలీ, స్పెయిన్ లోకూడా ఉన్నాయని ఆయన అన్నారు. గురువారం నాటికి చైనాలో 81వేల 620మందికి కరోనా కేసులు నమోదయ్యాయని.. అందులోనుంచి 3వేల 322మంది చనిపోయారని చెప్పారు.

Latest Updates