ఆసీస్‌‌ స్పిన్నర్‌‌ అగర్‌‌కు తీవ్ర గాయం

సిడ్నీ:  ఆస్ట్రేలియా లెఫ్టామ్‌‌ స్పిన్నర్‌‌ ఆస్టన్‌‌ అగర్‌‌ ఆదివారం జరిగిన ఓ డొమెస్టిక్‌‌ మ్యాచ్‌‌లో తీవ్రంగా గాయపడ్డాడు. మిడాన్‌‌లో ఫీల్డింగ్‌‌ చేస్తున్న అగర్‌‌ క్యాచ్‌‌ అందుకునే క్రమంలో జారడంతో బాల్‌‌ కనుబోమ్మల మధ్య నుదిటి భాగంలో బలంగా తగిలి రక్తస్రావం జరిగింది. అగర్‌‌ తన సొంత తమ్ముడు వెస్‌‌ అగర్‌‌ కొట్టిన షాట్‌‌కే గాయపడ్డాడు. ఆసీస్‌‌ డొమెస్టిక్‌‌ టోర్నమెంట్‌‌ మార్ష వన్డే కప్‌‌లో ఈ ఘటన జరగ్గా.. ఆస్టన్‌‌ అగర్‌‌ వెస్ట్రన్‌‌ ఆస్ట్రేలియాకు, వెస్‌‌ అగర్‌‌ సౌత్‌‌ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రక్తంతో తడిచిన ముఖంతో మైదానాన్ని వీడిన అగర్‌‌ తిరిగి బరిలోకి దిగలేదు. అయితే ప్రమాదం ఏమి లేదని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయమైన చోట కుట్లు వేయాలని డాక్టర్‌‌ సూచించగా, త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఆస్టన్‌‌ అందుకు నిరాకరించాడు. ప్లాస్టిక్‌‌ సర్జన్‌‌ను ఆశ్రయిస్తానని చెప్పాడు.

Australia's Agar suffers dangerous injury in Marsh Cup

Latest Updates