కామారెడ్డి హైవేపై ఆటో బోల్తాపడి ఇద్దరు మృతి

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. నిజామాబాద్ నుంచి కామారెడ్డికి కొత్తిమీర లోడ్ తో వెళ్తున్న ఆటో సదాశివనగర్ దగ్గర అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. మృతులను గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదం ఆదివారం పొద్దున జరిగింది.

Latest Updates