లారీని ఢీకొన్న ఆటో: 11మందికి గాయాలు

లారీని ఆటో వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ లోని తిమ్మాజీపేట వద్ద జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న 11మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. తిమ్మాజీపేట తుమ్మలకుంట తండాలో పెండ్లికి హాజరై తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆటోలో 15మందికి పైగా ఉన్నట్లు చెప్పారు.

Latest Updates