ఈ ఆటోలో ప్రయాణం చాలా కూల్ గురూ..!

బయట ఎండ మండుతోందా…

మండే ఎండలో బయటకెళ్లలేకపోతున్నారా…

అర్జెంట్ గా వెళ్లాలంటే ఏ ఆటోనే పట్టుకోవాలి. కానీ… ఆటోలో ఎక్కితే వడగాలి భయం.

పోనీ క్యాబ్ ఎక్కుదామంటే… అమ్మో సర్ చార్జీ కుమ్ముడు కుమ్ముతుంది. బిల్లు చుక్కలు చూపిస్తుంది.

బస్సెక్కుదామంటే.. బస్టాప్ దాకా నడవాలి.. ఎదురుచూడాలి.. బస్ లో రష్ ఉంటే.. అమ్మో ఉక్కపోత.

అందుకే.. సామాన్యుడి వాహనం అయిన ఆటో సమ్మర్ లో సరికొత్తగా ముస్తాబైంది.

ఓ ఆటోవాలా ఈ ఎండాకాలంలో ప్యాసింజర్లను ఆకట్టుకునేందుకు తన క్రియేటివిటీ చూపించాడు.

తన ఆటో చాలా డిఫరెంట్ అంటున్నాడు.

సమ్మర్ కు తగ్గట్టుగా ఆటోను డెకరేట్ చేశాడు.

ఆటో పైకప్పు మీద ఓ తోట పెట్టేశాడు.

ఆ మధ్య నార్తిండియాలో ఈ వార్త చూశాం. ఇప్పుడు మన హైదరాబాద్ లో అలాంటి ఆటోనే సందడిచేస్తోంది. బేగంపేట్ ఏరియాలో ‘వీ6 వెలుగు’ కెమెరాకు చిక్కింది.

ఆటోకు చుట్టూ గ్రీన్ కర్టెన్ కట్టాడు. దానిపై చల్లదనం కోసం కొబ్బరి పీచు.. దానిపైన పచ్చగడ్డి. సెటప్ అదిరింది.

అసలే మండే ఎండలు. 2,3 రోజులు ఎండలు భారీగా ఉంటాయన్న వెదర్ అలర్ట్ కూడా ఉంది. అందుకే.. ఈ ఆటో.. దాని సెటప్ ఆకట్టుకుంటోంది.

Latest Updates