విల్లా కొన్న ఆటో డ్రైవర్: నోటీసులిచ్చిన ఐటీ అధికారులు

బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ 1.6 కోట్లు విలువ చేసే విల్లాను కొన్నాడు. దీంతో.. ఐటీ శాఖ అతని ఇంటిని తనికీ చేసింది. సుబ్రమణి అనే  మామూలు ఆటో డ్రైవర్ అంత విలువ చేసే విల్లాను ఎలా కొన్నాడని ఐటీ శాఖ అధికారులు ఆరా తీశారు. సుబ్రమణి  ఓ విదేశాయురాలికి బినామీగా ఉన్నాడని కనుగొన్నారు. ఆమె ఎకౌంట్ నుంచి ఇతనికి నగదు బదిలీ అయినట్లు గుర్తించారు.

విదేశీయురాలిని నమ్మించి సుబ్రమణి భారత్ లో ఆస్తులు కొనుగోలు చేయించి ఉంటాడని ఐటీ అధికారులు భావిస్తున్నారు. అతని మాటల్లో పడిన ఫారెనర్… సుబ్రమణి పేరుమీదే ఆస్తులు కొనడానికి ఒప్పుకున్నట్లు అనుమానిస్తున్నారు. సోదాల అనంతరం సుబ్రమణిని విచారణకు హాజరు కావలసిందిగా నోటీసులు జారీచేశారు ఐటీ అధికారులు.

Latest Updates