మియాపూర్ లో ఆటో డ్రైవర్ దారుణ హత్య

హైదరాబాద్ మియాపూర్‌లో ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. ధర్మపురి క్షేత్రం దగ్గర 24 ఏళ్ల  ఆటో డ్రైవర్‌ ప్రవీణ్‌ ను గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. తల, మొండెం వేరుచేసి…  తలను బొల్లారం చౌరస్తాలో పడేశారు. మొండెం, తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

 

Latest Updates