స్కూల్ నుంచి వస్తుండగా..బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం

శ్రీకాకుళం జిల్లాలో బాలికపై అత్యాచార యత్నం చేశాడు ఓ ఆటో డ్రైవర్. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బాలికను రోడ్డు పక్కన తోటలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. తప్పించుకునేందుకు ప్రయత్నం చేసిన ఆ అమ్మాయి సాయం కోసం గట్టిగా కేకలు వేసింది. అటుగా వెళ్తున్న యువకులు గమనించి.. బాలికను కాపాడారు. శ్రీకాకుళం జిల్లా రేగడి మండలం తోకలవలస దగ్గర శనివారం ఈ ఘటన జరిగింది.

ఆటో డ్రైవర్ వాకడ సురేశ్.. ఓ ప్రైవేట్ స్కూల్‌కు పిల్లల్ని వదిలిపెట్టి తీసుకొస్తుంటారు. ఇలా శనివారం సాయంత్రం పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టేందుకు వస్తుండగా ఆ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో కాపాడిన యువకులు.. ఆటో డ్రైవర్‌ను చితక బాది పోలీసులకు అప్పగించారు. అయితే అతడిపై ఫిర్యాదు చేసేందుకు బాలిక తల్లిదండ్రులు వెనకాడుతున్నారని తెలిసింది.

MORE NEWS:

రేప్‌ల రాజధానిగా భారత్: రాహుల్ గాంధీ

మగవాళ్లే ఇంట్లో కూర్చుంటే.. అమ్మాయిలు సేఫ్: మహిళ వీడియో వైరల్

Latest Updates