ఆర్టీసీ మిలియన్ మార్చ్ కు ఆటో జేఏసీ మద్దతు

ఆర్టీసీ జేఏసీ తల పెట్టిన మిలియన్ మార్చ్ కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ అమణుల్లా ఖాన్. ఆదివారం ట్యాంక్ బండ్ పై జరుగనున్న మిలియన్ మార్చ్ కు ఆటో డ్రైవర్లందరూ తరలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఆర్టీసీ కార్మికులకు మిగితా యూనియన్లు దూరంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఉచిత సలహాలు ఇస్తున్నారని అన్నారు. కార్మికులను యూనియన్లను దూరం చేస్తే పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేసినట్లేనని చెప్పారు.

కేసీఆర్ కు చరిత్రహీనుడు అనే బిరుదును త్వరలో ప్రగతి భవన్ కు వెళ్లి ఇవ్వనున్నామని అన్నారు అమణుల్లాఖాన్. ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటం చేస్తున్న జేఏసీ కన్వీనర్ కు ఆర్టీసీ కార్మిక పోరాట రత్న బిరుదును త్వరలో ఇస్తామని చెప్పారు. డ్యూటీలో అవినీతి, అలసత్వం వహిస్తున్న వెస్ట్ జోన్ ఆర్టీఓ వెంకటేశ్వర రావును వెంటనే బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Latest Updates