కష్టాల్లోనే ఉన్నాం ఆదుకోండి ప్లీజ్..

న్యూఢిల్లీఆటో సేల్స్ ఆగస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా పడిపోవడంతో.. ఈ ఇండస్ట్రీ కోలుకునేందుకు వెనువెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆటో ఇండస్ట్రీ బాడీ సియామ్ కోరుతోంది. జీఎస్టీ రేట్లను తగ్గించాలని, స్క్రాపేజ్ పాలసీని ప్రారంభించాలని ప్రభుత్వానికి విన్నవించింది. కమర్షియల్ వెహికిల్స్, టూవీలర్ సేల్స్ కూడా బాగా పడిపోతున్నాయని, మార్కెట్ అంతా నెగిటివ్ ధోరణిలో ఉందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్(సియామ్) తెలిపింది. గత నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు చర్యలు ప్రకటించినప్పటికీ.. మార్కెట్ స్పందించలేకపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచుకోవడానికి ఇండస్ట్రీ ఆకర్షణీయమైన పలు డీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, డిస్కౌంట్లను  ప్రవేశపెట్టినట్టు తెలిపింది. అయినా కూడా అమ్మకాలు పెరగలేదని చెప్పింది.

డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సృష్టించడానికి, వెహికిల్స్ ఖర్చును తగ్గించడానికి జీఎస్టీ రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించేలా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వాధేరా అన్నారు. ఆర్థిక మంత్రి ఇచ్చిన వాగ్దానం మేరకు.. ఆటో మొబైల్ ఇండస్ట్రీలోని అన్ని సెగ్మెంట్లను కవర్ చేసేలా ప్రోత్సాహక పూరిత స్క్రాపేజ్ పాలసీ ఉండాలని కోరారు. ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కాబోతుందని, ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ నిర్ణయాలపై వెను వెంటనే నిర్ణయం తీసుకుంటే.. ఇండస్ట్రీకి ఇది మంచి ఫెస్టివల్ సీజన్ అవుతుందన్నారు. ఇండస్ట్రీ రికవరీ అవుతుందని భావిస్తున్నామని చెప్పారు.

Latest Updates