తెలంగాణలో వెయ్యి ఎకరాల్లో ఆటో మొబైల్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్

రాష్ట్రంలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ అందుబాటులో ఉంద‌న్నారు మంత్రి కేటీఆర్.  సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. ఈవీలకు చార్జింగ్ స్టేష‌న్లు, బ్యాట‌రీ త‌యారీ కంపెనీలు రాష్ట్రంలో  పెట్టుబ‌డి పెట్ట‌నున్నాయని చెప్పారు. ఎల‌క్ట్రిక్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ కోసం అందుబాటులో భూములు ఉన్నాయ‌ని తెలిపారు. మ‌హేశ్వ‌రంలో వేల ఎక‌రాలు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి కేటీఆర్ వెయ్యి ఎక‌రాల్లో ఆటో మొబైల్ త‌యారీ యూనిట్‌ను ప్రోత్స‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్‌లో ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ వాహ‌నాల త‌యారీ, నిర్వ‌హ‌ణ‌కు కంపెనీల‌ను ఆహ్వానిస్తున్నామన్నారు.  ఈవీ విధానాన్ని విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ గ‌తంలో ఈసీఐఎల్ వంటి ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌తో ఎల‌క్ట్రానిక్స్ రంగంలో దేశానికే హైద‌రాబాద్ కేంద్రంగా ఉండేదన్నారు. ఎల‌క్ట్రిక్ వెహికిల్స్  నూత‌న విధానం అద్భుతంగా విజ‌య‌వంతం కాబోతుంద‌న్నారు. హైద‌రాబాద్‌లో పెద్ద ఎత్తున ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు  కేటీఆర్. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ రంగంలో కంపెనీలు పెట్టుబ‌డులు పెట్ట‌బోతున్నాయ‌న్న మంత్రి కేటీఆర్… ఇప్ప‌టికే 78 ఛార్జింగ్ స్టేష‌న్లు ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలో ఉన్నాయ‌న్నారు.

Latest Updates