ఫేస్‌‌బుక్‌‌లో  అవతార్స్‌‌

పర్సనలైజ్డ్‌‌ ఫీచర్స్‌‌తో యూజర్స్‌‌ను అట్రాక్ట్‌‌ చేసే ‘ఫేస్‌‌బుక్‌‌’ తాజాగా ‘అవతార్‌‌‌‌’ అనే మరో ఫీచర్‌‌‌‌ను తీసుకొచ్చింది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌‌‌‌ ఇప్పుడు మన దగ్గరకి వచ్చేసింది. యూజర్స్‌‌ ఈ ఫీచర్‌‌‌‌ ద్వారా తమకు నచ్చిన ‘అవతార్‌‌‌‌’ను క్రియేట్‌‌ చేసుకోవచ్చు. ఎవరో క్రియేట్‌‌ చేసిన జిఫ్స్‌‌, వీడియో ఫైల్స్ బదులు తమకు నచ్చిన అవతార్స్‌‌ను క్రియేట్‌‌ చేసుకుని ‘కామెంట్‌‌’ సెక్షన్‌‌లో రిప్లై ఇవ్వొచ్చు. స్టోరీస్‌‌లో పోస్ట్‌‌ చేయొచ్చు. ప్రొఫైల్‌‌ పిక్చర్‌‌‌‌గా మార్చుకోవచ్చు.

 ఇప్పటివరకు జిఫ్స్‌‌, స్టిక్కర్స్‌‌, వీడియోస్‌‌తో మాత్రమే కామెంట్‌‌ సెక్షన్‌‌లో రెస్పాండ్‌‌ అయిన యూజర్స్‌‌, ఇప్పుడు ‘అవతార్‌‌‌‌’తోనూ ఆకట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఫేస్‌‌బుక్‌‌ యాప్‌‌తోపాటు, మెసెంజర్‌‌‌‌ యాప్‌‌లో మాత్రమే ఈ ఫీచర్‌‌‌‌ అందుబాటులో ఉంది. అలాగే మెసెంజర్‌‌‌‌లో మాత్రం ‘ఆండ్రాయిడ్‌‌ ఓఎస్‌‌’కే పరిమితం. ‘ఐఓఎస్‌‌’ ప్లాట్‌‌ఫామ్‌‌పై మెసెంజర్‌‌‌‌ యూజర్స్‌‌కు ఈ ఫీచర్‌‌‌‌ లేదు. అది కూడా తమకు నచ్చిన అవతార్‌‌‌‌ను క్రియేట్‌‌ చేసుకోవచ్చు. యాప్‌‌లో కామెంట్‌‌ సెక్షన్‌‌లో లేదా బుక్‌‌మార్క్స్‌‌లో ‘స్మైలీ’ ఐకాన్‌‌పై క్లిక్‌‌ చేసి, తర్వాత ‘స్టిక్కర్స్‌‌’పై ట్యాప్‌‌ చేస్తే, ‘మేక్ యువర్‌‌‌‌ అవతార్‌‌‌‌’ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్‌‌ చేసి యూజర్స్‌‌, తమ టేస్ట్‌‌కు అనుగుణంగా ‘అవతార్‌‌‌‌’ను క్రియేట్‌‌ చేసుకోవచ్చు. ఇవి కార్టూన్స్‌‌లో ఉంటే ఫన్నీ క్యారెక్టర్స్‌‌‌‌గా కూడా కనిపిస్తాయి. అవతార్‌‌‌‌ సెక్షన్‌‌లోంచి యూజర్స్‌‌ తమకు నచ్చిన జెండర్‌‌‌‌, ఫేస్‌‌, కలర్‌‌‌‌, హెయిర్‌‌‌‌ స్టైల్‌‌, బాడీ షేప్‌‌, ఎక్స్‌‌ప్రెషన్స్‌‌ను సెలెక్ట్‌‌ చేసుకోవచ్చు. అలాగే ట్రెడిషనల్‌‌ డ్రెస్‌‌, మోడర్న్‌‌ డ్రెస్‌‌, బొట్టు, లిప్‌‌స్టిక్‌‌.. ఇలా నచ్చిన స్టయిల్ సెలెక్ట్‌‌ చేసుకుని, అవతార్‌‌‌‌లు తయారు చేసుకోవచ్చు. ఇలా క్రియేట్‌‌ చేసుకున్న అవతార్‌‌‌‌లను కామెంట్‌‌ సెక్షన్‌‌తోపాటు, స్టోరీస్‌‌గా పోస్ట్‌‌ చేయొచ్చు. ప్రొఫైల్‌‌ పిక్చర్‌‌‌‌గా కూడా మార్చుకోవచ్చు. ఫేస్‌‌బుక్‌‌తోపాటు, మెసెంజర్‌‌‌‌, వాట్సాప్‌‌లోనూ షేర్‌‌‌‌ చేసుకోవచ్చు. ఇందులో దేశంలోని యూజర్స్‌‌ కోసం స్పెషల్‌‌గా డిజైన్‌‌ చేసిన అవతార్స్‌‌ కూడా ఉన్నాయి. ఇలాంటి ఫీచర్‌‌‌‌ ‘స్నాప్‌‌చాట్‌‌’లో ఇప్పటికే ‘బిట్‌‌మోజి’ పేరుతో ఉంది. ఈ ఫీచర్‌‌‌‌ నుంచి ఇన్‌‌స్పైర్‌‌‌‌ అయి ఫేస్‌‌బుక్‌‌ ‘అవతార్‌‌‌‌’ను డెవలప్‌‌ చేసింది.

 

Latest Updates