తొలిరోజు రూ.1500కోట్లు కొల్లగొట్టిన అవెంజర్స్

చైనాలో ప్రివ్యూలు కలిపి రూ.750కోట్ల వసూళ్లు

ఇండియాలో బాహుబలిని దాటేస్తుందంటున్న విశ్లేషకులు

అవెంజర్స్ ఎండ్ గేమ్.. పాత రికార్డులకు ఎండ్ కార్డ్ వేస్తోంది. సిరీస్ కు ఎండ్ కార్డ్ పడుతుండటంతో విడుదలైన ప్రతి చోటా రికార్డుల కొండెక్కుతోంది. ఎక్కడికక్కడ కొత్త సి నిమాలకు సరికొత్త రికార్డులను సెట్ చేసి పెడుతోంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹1512 కోట్ల (21.66కోట్ల డాలర్లు) కలెక్షన్ల పైకాన్ని మూటగట్టేసుకున్నట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. ఉత్తర అమెరికాలో విడుదలను కలుపుకుంటే 28 కోట్ల డాలర్లకు (సుమారు ₹1955 కోట్లు) చేరొచ్చని ట్రేడ్ విశ్లేష కులు చెబుతున్నా రు.

చైనాలో మిడ్ నైట్ ప్రివ్యూలతో కలిపి తొలి రోజు దాదాపు ₹748 కోట్లు (10.72 కోట్ల డాలర్ల) రాబట్టిం ది. ప్రివ్యూలను తీసేస్తే దాదాపు ₹559 కోట్ల (8 కోట్ల డాలర్లు) కలెక్షన్లను అవెంజర్స్ ఎండ్ గేమ్ సాధించింది. ఇండియాలోనూ ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లను ఓ ఊపు ఊపేసిందని ట్రేడ్ విశ్లేష కులు చెబుతున్నా రు. థియేటర్లలో 80 నుంచి 85 శాతం ఆ సినిమానే ఆక్రమిం చేసిందని అంటున్నా రు. బాక్సాఫీస్ వద్ద బాహుబలి 2, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ నెలకొల్పిన రికార్డు కలెక్షన్లు ₹122 కోట్లు, ₹52 కోట్లను దాటేసే దిశగా దూసుకెళుతున్నట్టు చెబుతున్నారు.

ఒక్క బుక్ మై షోలోనే 25 లక్షల టి కెట్లు అమ్ముడుపోయినట్టు ఆ సంస్థ వె ల్లడిం చింది. బాహుబలి 6500 స్క్రీన్లు, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ 5 వేల స్క్రీన్లలో విడుదలైతే ఎండ్ గేమ్ మాత్రం 2845 స్క్రీన్లలో విడుదలవడం విశేషం. అమెరికాలో 4600 స్క్రీన్లలో ఈ సి నిమా విడుదలైంది. ఈ సినిమాను దాదాపు ₹2800 కోట్లతో (40 కోట్ల డాలర్లు) తీశారు. తొలిరోజే 1500 కోట్లకు చేరడంతో.. రెం డు రోజుల్లో నే సినిమా ఖర్చును కలెక్షన్లు దాటిపోతాయని అంటున్నా రు.

కొద్దికొద్దిగా హైప్

అవెంజర్స్‌‌ సిరీస్‌‌లో చివరి భాగం.. ఎండ్‌‌ గేమ్. ఈ మాట వినగానే ప్రపంచమంతా డీలా పడిపోయింది. సిరీస్ ముగిసి పోవడమేం టని ఫీలైపోయారంతా. ఆ ఫీలింగే ‘ది ఎండ్‌‌గేమ్‌‌’కి మొదటి పెట్టుబడి. అక్కడి నుంచి అంచనాలను పెంచుకుంటూ పోయారు దర్శక నిర్మాతలు. పోస్టర్లను రిలీజ్ చేసి, కొద్ది కొద్దిగా కథలోని విశేషాల్ని లీ క్ చేసి క్యూరియాసిటీని పెం చేశారు. సినిమా రిలీజ్‌‌కి కొన్ని రోజుల ముందే టికెట్స్‌‌ అన్నీ బుక్కైపోయేంతగా అట్రాక్ట్ చేశారు. దీం తో మార్వెల్ సి నిమాటిక్ యూనివర్స్‌‌ నుంచి వచ్చి న ఈ ఇరవై రెండో సినిమా దెబ్బకి మొదటి రోజే బాక్సాఫీస్ దద్దరిల్లిం ది. చైనాలో మొదటిసారిగా బ్లాక్‌‌లో అత్యధిక ధరకు టి కెట్స్ అమ్ముడుపోయాయట. సహజంగా అరవై యువాన్లు (సుమారు ₹660) ఉండే టి కెట్ ఐదు వందల యువాన్లకు (₹5 వేలు) పైగా ధర పలికిందంటే అవెంజర్స్ ప్రభంజనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా దేశాల్లో కూడా దీని హవా తక్కువేమీ లేదు. ఆస్ట్రేలియాలో  ఏడు మిలియన్ డాలర్లు (సుమారు ₹48.85 కోట్లు), దక్షిణ కొరియాలో 8.4 మిలియన్ డాలర్స్ (₹58.63 కోట్లు), ఫ్రాన్స్‌‌లో 6 మిలియన్ డాలర్స్ (₹41.87 కోట్లు) వసూలు చేసిందని సమాచారం.

దీని ప్రభంజనం ఇక్కడితో ఆగేలా కనిపిం చట్లేదని ట్రేడ్ విశ్లేష కులు చెబుతున్నా రు. ₹5600 కోట్ల వరకు కలెక్షన్లు చేరే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ను మాత్రం ఎండ్ గేమ్ క్రాస్ చేయలేకపోయింది. గత ఏడాది విడుదలైన ఆ సినిమా దాదాపు ₹2100 కోట్లు  వసూలు చేసింది.

Latest Updates