వీడియో: సూపర్ హీరోలను అచ్చంగా దించేసిన ఇండియన్ అవెంజర్స్

న్యూఢిల్లీ: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) రూపొందించిన అవెంజర్స్ మూవీ సిరీస్ ఎంత పాపులర్ అనేది తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సిరీస్‌‌కు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒకవేళ ఈ సినిమా ఇండియాలో తెరకెక్కితే ఎలా ఉంటుందో ఊహించారా? లేదా, అయితే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియన్ సూపర్ హీరోస్ ఎలా ఉంటారో మీకు చూపించబోతున్నాం. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ హైవే ఫేవరెట్ రణ్‌‌దీప్ హుడా దేశీ అవెంజర్స్ పేరుతో ఓ వీడియోను తన ఇన్‌‌స్టా అకౌంట్‌‌లో పోస్ట్ చేశారు.

అవెంజర్స్, అవెంజర్స్ ఎండ్‌‌గేమ్ క్యాప్షన్‌‌తో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రివర్స్‌‌గా ప్లే అయ్యే ఈ వీడియోలో నీళ్లలో నుంచి అబ్బాయిలు ఒకరి వెంబడి మరొకరు పైకి వస్తారు. ఒక్కో స్పెషల్ గ్యాడ్జెట్స్‌‌తో కెప్టెన్ అమెరికా, డాక్టర్ స్ట్రేంజ్, బ్లాక్ ప్యాంథర్, ఐరన్ మ్యాన్, థోర్‌‌‌లా సదరు అబ్బాయిలు పోజ్ ఇవ్వడం ఆకట్టుకుంది. ఈ పోస్ట్‌‌కు థోర్ ఫేమ్ క్రిస్‌‌హోంవర్త్‌‌తోపాటు మరి కొందరిని హుడా ట్యాగ్ చేశాడు. ఈ వీడియోను చూసి అవెంజర్స్ ఎండ్ గేమ్‌‌లోని అవెంజర్స్ అసెంబుల్ సీన్‌‌ను వాళ్లు గుర్తుకు తెచ్చారని నెటిజన్స్ అంటున్నారు. వీళ్లు అవెంజర్స్ కాదు రివెంజర్స్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి వైరల్ అవుతున్న దేశీ సూపర్ హీరోల వీడియోను మీరూ చూసేయండి.

Latest Updates