రెండున్నరేళ్ల తర్వాత ఆ గదిలో అవికా..

చిన్నప్పుడే చిన్నారి పెళ్లి కూతురుగా వచ్చి మార్కులు వేయించేసుకుంది అవికా గోర్.  అదే ఆమెకి హీరోయిన్ గా అవకాశాలు తెచ్చిపెట్టింది.  ఉయ్యాల జంపాల, లక్ష్మీ రావె మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, తాను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంది. కానీ ఒక చిన్న విషయానికి నొచ్చుకుని ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. రెండున్నరేళ్లుగా తెలుగునాట అడుగు పెట్టలేదు. ఇన్నాళ్లకి మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ‘రాజుగారి గది 3’లో చోటు సంపాదించింది. అశ్విన్ హీరోగా ఓంకార్‌‌ రూపొందించిన ‘రాజుగారి గది’ మంచి హిట్కొట్టింది.

అయితే రెండో భాగం మాత్రం అంతంతమాత్రంగా మిగిలిపోయింది.నాగార్జున, సమంత లాంటి స్టార్స్ ఉన్నా మొదటి పార్ట్ స్థాయిలో సక్సెస్ ను అందుకోలేదు. ఇప్పుడు మూడో భాగంతో ముచ్చెమటలు పట్టించేందుకు రెడీ అవుతున్నాడు ఓంకార్. ఫిమేల్‌ లీడ్ గా మొదట తమన్నాని తీసుకున్నాడు. ఆమె ఏవో కారణాల చేత తప్పుకుంది. దాంతో తాప్సీ కోసం ట్రై చేస్తున్నాడనే వార్తలొచ్చాయి. కానీ అవికాకి ఫిక్సయ్యాడని వినాయక చవితినాడు రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ క్లారిటీ ఇచ్చింది. దెయ్యం గెటప్ లో అవిక భయంకరంగా ఉంది. మంచి నటి కనుక అద్భుతంగా నటించే తీరుతుంది. కాబట్టి సినిమా సక్సెస్‌ అయితే ఆమె తెలుగులో మళ్లీ పాగా వేసినా వేయొచ్చు. ఏం జరుగు తుందన్నది దసరాకి తెలుస్తుంది.

Latest Updates