బైకును తప్పించబోయి లారీని ఢీకొట్టి.. నలుగురి మృతి..

మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబీకులు

తల్లిదండ్రులతోపాటే చనిపోయిన వెంకటేశ్వర రెడ్డి (29)

స్వల్పాగాయాలతో బయటపడిన వెంకటేశ్వరరెడ్డి భార్య శిరీష (28)  

చిత్తూరు జిల్లా బంగారుపాళెం వద్ద ప్రమాదం

ఏపీ: చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై, బెంగుళూరు జాతీయ రహదారి బంగారుపాళ్యం మండలం బలిజిపల్లి గ్రామం దాభా వద్ద ఆగి ఉన్న గూడ్సు ట్రాన్స్ పోర్టు లారీని కారు వెనుక నుండి ఢీకొట్టింది. బైకు అడ్డువచ్చిందని తప్పించే ప్రయత్నంలో కారును పక్కకు మళ్లించడంతో.. అక్కడ నిలిచి ఉన్న లారీ కిందకు కారు దూసుకుపోయింది. దీంతో కారు ముందు సీట్లలో ఉన్న డ్రైవర్.. మరొ వ్యక్తితోపాటు.. వెనుక వైపు కూర్చున్న మరో వ్యక్తి కూడా చనియారు. తప్పించుకునే ప్రయత్నం చేసిన బైకు వ్యక్తి కూడా కన్ను మూశాడు.

నెల్లూరుకు చెందిన వెంకటేశ్వర రెడ్డి(29)  తన తల్లిదండ్రులు  రత్నమ్మ (49), తండ్రి శ్రీనివాసులు రెడ్డి (55).. భార్య తో కలసి బెంగళూరు నుంచి తన సొంతూరు అయిన నెల్లూరులో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఓ స్థలం విషయం సొంతూరికి వస్తున్న వీరి కారుకు బైకు అడ్డు రావడంతో అతనిని తప్పించబోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ని బలంగా ఢీ కొట్టింది. కారులో ఉన్న వెంకటేశ్వర్లు.. ఆయన తల్లిదండ్రులు.. ముగ్గురు తీవ్రంగా గాయపడి  మృతి చెందారు. బైకు పై వెళ్తున్న బంగారుపాళ్యం వాసి బాబు (45) కూడా అక్కడిక్కడే మృతి చెందాడు. చనిపోయిన వెంకటేశ్వర్లు రెడ్డి భార్య శిరీష (28) మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది.

Latest Updates