ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలపై నజర్: హోల్ సేల్ షాపుల సీజ్

సిటీలో ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్నవారిపై GHMC నజర్ పెట్టింది. 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న కవర్లు అమ్ముతున్న దుకాణాలపై…. బల్దియా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు చేశారు. బేగంబజార్ లో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న హోల్ సేల్ షాపులను సీజ్ చేశారు. మరోసారి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హైదరాబాద్ లో ప్లాస్టిక్ నియంత్రణకి జీహెచ్ఎంసి ఎన్పోర్స్ మెంట్ విభాగం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సిటీలో 2016 సాలిడ్ వేస్ట్ మెనేజ్మెంట్ నిబంధనలతో పాటు, ప్లాస్టిక్ నియంత్రణపై స్పెషల్ ఫోకస్ చేశారు అధికారులు. ఎప్పటికప్పుడు అవగాహన చర్యలు చేపట్టడంతో పాటు అప్పుడప్పుడు దుకాణదారులు, చిన్న వ్యాపారులపై దాడులు చేసి 50 మైక్రాన్లకన్నా తక్కువ మందం ఉన్న కవర్లను సీజ్ చేస్తున్నారు.

తాజాగా బేగంబజార్ లో హోల్ సేల్ ప్లాస్టిక్ అమ్మకందారులపై దృష్టిపెట్టారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో నాలుగు షాపులు సీజ్ చేశారు. ప్లాస్టిక్ నియంత్రణకు అందరూ సహకరించాలని..లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు.

నిషేధం మంచిదే: ఎమ్మెల్యే రాజాసింగ్
ప్లాస్టిక్ కవర్లపై నిషేధం మంచిదన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే కవర్లు ఉత్పత్తయ్యే ప్రాంతాల్లోనే ప్లాస్టిక్ ను నిషేధించాలని సూచించారు. చిన్నచిన్న వ్యాపారులను ఇబ్బందులు పెట్టొద్దని కోరారు. కంపెనీలను నియంత్రించాలని అధికారులకు సూచించారు.

ఇక సిటిలో ప్లాస్టిక్ నియంత్రణపై ఎప్పటికప్పుడు మాటలు చెబుతూ వచ్చిన అధికారులు. ఇప్పుడు చర్యలు చేపడుతున్నారు. వీటిని నియంత్రించి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు.

Latest Updates