ఓటు వినియోగంపై అవగాహన ర్యాలీ

హైదరాబాద్ : రాష్ట్రంలో దివ్యాంగుల ఓటింగ్ శాతం పెరుగుతుండటం సంతోషమన్నారు సీఈవో రజత్ కుమార్. ఓటు అవగాహన కోసం ఎన్నో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు ఓటు వినియోగంపై నెక్లెస్ రోడ్ లోని అవగాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి సీఈవో రజత్ కుమార్. సీపీ అంజనీ కుమార్, క్రికెటర్ మిథాలీరాజ్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సిటీలో దివ్యాంగులు సులభంగా పోలింగ్ స్టేషన్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగుల ఓటింగ్ శాతం పెరుగుతుండటం సంతోషకర విషయమన్నారు. ఓటు అవగాహన కోసం ఎన్నో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దివ్యాంగ ఓటర్ల చైతన్యం కోసం చేపడుతున్న కార్యక్రమాలను రాష్ట్రపతి సైతం ప్రశంసించారన్నారు. ఈసారి 70 వేల మంది దివ్యాంగులు అదనంగా ఓటు జాబితాలో చేరారన్నారు రజత్ కుమార్.
 

Latest Updates