రూ.1,388 కోట్ల నష్టాల్లో యాక్సెస్ బ్యాంక్

న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన క్వార్టర్ ‌(క్యూ4) లో యాక్సిస్‌ బ్యాంక్‌కి రూ. 1,387.78 కోట్ల నష్టం వచ్చింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో బ్యాంక్‌కు రూ. 1,505 కోట్ల లాభం వచ్చింది. ప్రొవిజన్స్‌ భారీగా పెరగడంతోనే బ్యాంక్‌కు నష్టాలు వచ్చాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే ఈ ప్రొవిజన్స్‌ 185 శాతం పెరిగి రూ. 7,730 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో రూ. 3 వేల కోట్లుకోవిడ్‌ 19 సంబంధ ప్రొవిజన్సే ఉన్నట్లుయాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. క్యూ4 లో బ్యాంక్‌ నికర వడ్డీఆదాయం 19 శాతం పెరిగి రూ. 6,808 కోట్లుగా నమోదైంది. ఈ ఆదాయం గత ఆర్ధిక సంవత్సరం  క్యూ4లో రూ. 5,706 కోట్లుగా ఉంది. బ్యాంక్‌ గ్రాస్‌ ఎన్‌పీ ఏలు 5.26 శాతం(2018–19లో) నుంచి 4.86 శాతానికి తగ్గాయి. నెట్‌ ఎన్‌పీఏలు కూడా 2.06 శాతం నుంచి 1.56 శాతానికి మెరుగుపడ్డాయి. ఏడాది కిందటితో పోలిస్తే డిపాజిట్లు17 శాతం పెరిగాయని, బ్యాలెన్స్‌ షీట్‌ 14 శాతం పెరిగి రూ. 9.15 లక్షల కోట్లకు చేరిందని యాక్సిస్‌ బ్యాంక్‌ పేర్కొంది. మరోవైపు అప్పుల ద్వారా రూ. 35 వేల కోట్లుసేకరించే ప్రపోజల్‌ను యాక్సిస్‌ బ్యాంకు బోర్డు ఓకే చేసింది. మ్యాక్స్‌‌లైఫ్‌లో 30 శాతం వాటా.. లైఫ్‌ ఇన్సూరెన్స్‌‌‌‌కంపెనీ మ్యాక్స్‌‌‌‌లైఫ్‌లో 30 శాతం వాటాను యాక్సిస్‌ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.1,600 కోట్లు చెల్లించనుంది.  అనల్‌‌‌‌జిత్ సిం గ్‌‌‌‌కు చెం దిన మ్యా క్స్‌‌‌‌ గ్రూప్‌లో ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ.. మ్యాక్స్‌‌‌‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌‌‌‌. రెం డు దఫాల్లో ఈ డీల్‌‌‌‌ముగిశాక, మ్యాక్స్‌‌‌‌ఫైనాన్షియల్ ‌‌‌సర్వీసెస్‌‌‌‌కు ఇన్సూరెన్స్‌‌‌‌కంపెనీలో 70 శాతం వాటా మిగులు తుంది. అయితే ఈ విషయాన్నిమ్యాక్స్‌‌‌‌.. ఇంకా బోర్డ్‌‌‌‌ ఆఫ్‌ డైరెక్టర్స్ కు తెలియజేయలేదు. త్వరలో దీనిపై ప్రకటన చేస్తుందని కంపెనీ వర్గాలు చెప్పాయి. డీల్‌‌‌‌ ఖరారయ్యాక యాక్సిస్‌ బ్యాంకు.. మ్యాక్స్‌‌‌‌లై ఫ్‌ ఇన్సూరెన్స్‌‌‌‌కంపెనీ బోర్డులో ముగ్గురు లేదా నలుగురు డైరక్టర్లను  నామినేట్‌ చేస్తుంది. వాటా బదిలీ కోసం రెండు కంపెనీలు ఫిబ్రవరిలోనే  రహస్యంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం యాక్సిస్ ‌బ్యాంకు కు మ్యాక్స్ ‌‌‌‌లైఫ్‌లో రెండుశాతం కంటే తక్కువ వాటాయే ఉంది. అయితే వాటా కొనుగోలుకు ఐఆర్‌‌‌‌డీఏ వంటి రెగ్యులేటరీ ఏజెన్సీల పర్మిషన్లు అవసరం. ఈ డీల్‌‌‌‌వల్ల యాక్సిస్‌ బ్యాంకు కూడా ఐసీఐసీఐ, కోటక్‌‌‌‌మహీంద్రా, స్టేట్‌బ్యాంకుల సరసన చేరుతుంది. ఈ బ్యాంకులకు బీమా కంపెనీ ల్లో వాటాలు ఉన్నాయి. మ్యాక్స్‌‌‌‌లైఫ్‌ మనదేశంలోనే అతిపెద్దనాన్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ప్రైవేట్‌ బీమా కంపెనీ. దీని ఆస్తుల విలువ రూ.10,077 కోట్లు.

Latest Updates