హైదరాబాద్‌‌లో అయాన్‌‌ ఎక్సేంజ్‌‌ ‘ఆర్‌‌ అండ్‌‌ డీ’ సెంటర్..

హైదరాబాద్: స్వచ్ఛమైన నీటి తయారీతోపాటు ఎన్విరాన్‌‌మెంట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ సొల్యూషన్స్‌‌ అందించే అయాన్‌‌ ఎక్సేంజ్‌‌ తన కొత్త ఆర్‌‌ అండ్‌‌ డీ సెంటర్‌‌ (పరిశోధనా అభివృద్ధి కేంద్రం)ను హైదరాబాద్‌‌లోని పటాన్‌‌చెరులో శుక్రవారం ప్రారంభించింది. ఇక్కడ కెమికల్స్‌‌, రెజిన్స్‌‌, మెంబ్రేన్స్‌‌పై పరిశోధనలు నిర్వహిస్తారు. కొత్త డిజైన్లు రూపొందిస్తారు. ఈ సెంటర్‌‌ కోసం రూ.30 కోట్లు ఇన్వెస్ట్‌‌ చేసినట్టు కంపెనీ సీఎండీ రాజేశ్‌‌ శర్మ ప్రకటించారు.   ప్రస్తుత కంపెనీకి ఉన్న టెక్నాలజీలను, ఇంజనీరింగ్‌‌ సెగ్మెంట్లను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. రెజిన్స్‌‌, మెంబ్రేన్స్‌‌, పాలిమర్స్‌‌, స్పెషాలిటీ కెమికల్‌‌ టెక్నాలజీలను నీటిలోని మలినాలను తొలగించడానికి ఉపయోగిస్తారు.  దాదాపు 50 మంది ఉద్యోగులు ఉండే  ఈ సెంటర్‌‌లోని మైక్రోబయాలజీ ల్యాబ్‌‌ ఎంజైమ్‌‌ పరిశోధనలపై దృష్టి సారిస్తుందన్నారు.

24 వేల చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ ఆర్ అండ్ డీ సెంటర్‌‌కు డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్ సైంటిఫిక్‌‌ అండ్ ఇండస్ట్రియల్‌‌ రీసెర్చ్‌‌ (డీఎస్‌‌ఐఆర్‌‌) గుర్తింపు కూడా ఉందని చెప్పారు. ‘‘ఇది ఇండియాతోపాటు విదేశాల్లోని అయాన్ కస్టమర్ల అవసరాలను తీరుస్తుంది. ఇన్‌‌ఫ్రా, ఇండస్ట్రీ, ఇన్‌‌స్టిట్యూషన్స్‌‌, మున్సిపల్‌‌, హోమ్స్‌‌, అర్బన్‌‌, రూరల్‌‌ విభాగాలకు మేం సేవలు అందిస్తున్నాం. మా కంపెనీకి దేశీయంగా ఆరు ప్లాంట్లు, విదేశాల్లో రెండు ప్లాంట్లు ఉన్నాయి. వచ్చే ఏడాది రూ.100 కోట్ల వరకు లాభం వస్తుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం 52 రకాల ప్రొడక్టులను, సేవలను అందిస్తున్నాం. ఆహార వ్యర్థాల నుంచి గ్యాస్‌‌నుతయారు చేసే ప్రాజెక్టును కూడా చేపట్టాం’ అని శర్మ వివరించారు.

Latest Updates